కరోనా చికిత్సకు డీఆర్‌డీవో ఓరల్ డ్రగ్

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల చికిత్స కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) ఓరల్ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. మాడరేట్, సివియర్ పేషెంట్లకు ఈ మందును అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వడానికి డ్రగ్స్ రెగ్యులేటర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఆర్‌డీవోకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలయెడ్ సైన్సెస్, హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో సంయుక్తంగా ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. పౌడర్ రూపంలో ఉండే 2- డీఆక్సీ-డీ-గ్లూకోజ్(2-డీజీ)ని అభివృద్ధి చేసినట్టు కేంద్ర రక్షణ శాఖ […]

Update: 2021-05-08 08:03 GMT

న్యూఢిల్లీ: కరోనా పేషెంట్ల చికిత్స కోసం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) ఓరల్ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. మాడరేట్, సివియర్ పేషెంట్లకు ఈ మందును అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వడానికి డ్రగ్స్ రెగ్యులేటర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీఆర్‌డీవోకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలయెడ్ సైన్సెస్, హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో సంయుక్తంగా ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. పౌడర్ రూపంలో ఉండే 2- డీఆక్సీ-డీ-గ్లూకోజ్(2-డీజీ)ని అభివృద్ధి చేసినట్టు కేంద్ర రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పౌడర్‌ను నీటిలో కలుపుకుని తాగాలని సూచించింది. ఈ డ్రగ్ హాస్పిటల్ పాలైన పేషెంట్లు వేగంగా కోలుకోవడానికి సహాయపడినట్టు ట్రయల్స్‌లో తేలిందని వివరించింది.

సప్లిమెంటల్ ఆక్సిజన్ అవసరాన్ని తగ్గించిందని పేర్కొంది. మాడరేట్, సివియర్ పేషెంట్లకు అడ్జంట్ థెరపీగా ఈ మందును వాడటానికి మే 1న డీసీజీఐ అత్యవసర అనుమతులు ఇచ్చిందని తెలిపింది. జెనరిక్ మాలిక్యూల్, గ్లూకోజ్‌కు సారూప్యాన్ని కలిగి ఉండటంతో వీటిని సులువుగా ఉత్పత్తి చేయవచ్చునని, దేశంలో విరివిగా అందుబాటులోకి తేవచ్చునని పేర్కొంది. కరోనాతో ఇన్‌ఫెక్ట్ అయిన మానవ కణాలను ఒక చోట చేర్చి వైరస్ మరింత బలపడకుండా డ్రగ్ నిరోధిస్తుందని వివరించింది. ఇదే 2-డీజీ డ్రగ్ ప్రత్యేకత అని తెలిపింది.

Tags:    

Similar News