బోనాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకలు
దిశ, హైదరాబాద్: బోనాలు తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కోఠి డీఎంహెచ్ఎస్ ఆవరణలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో డీఎంహెచ్ఎస్ టీఎన్జీవో అధ్యక్షుడు మామిడి ప్రభాకర్ ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి డీపీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం ఉద్యోగులు ఎంతో భక్తితో బోనాలు నిర్వహించుకుంటారని అన్నారు. ఐతే ఈ […]
దిశ, హైదరాబాద్: బోనాలు తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు ప్రతీకలని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) డాక్టర్ జి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం కోఠి డీఎంహెచ్ఎస్ ఆవరణలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో డీఎంహెచ్ఎస్ టీఎన్జీవో అధ్యక్షుడు మామిడి ప్రభాకర్ ఆధ్వర్యంలో బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి డీపీహెచ్ డాక్టర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం ఉద్యోగులు ఎంతో భక్తితో బోనాలు నిర్వహించుకుంటారని అన్నారు. ఐతే ఈ యేడు కరోనా ప్రభావంతో ఎలాంటి ఆడంబరాలు లేకుండా అమ్మ వారికి పూజలు చేసి బోనం సమర్పించడం అభినందనీయన్నారు.