అమిత్ షా కాల్ టు ‘అజిత్ దోవల్’

దిశ,వెబ్‌డెస్క్ దేశ రాజధాని ఢిల్లీ తూర్పువైపున కొనసాగుతున్నహింసాకాండను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌ను రంగంలోకి దించారు. మంగళవారం రాత్రి అమిత్ షా దోబాల్‌తో పాటు ఢిల్లీ పోలీసు అధికారులతో మూడుసార్లు సమావేశమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ హింసాకాండను అణచివేసి శాంతిభద్రతలు అదుపులోకి తీసుకురావాలని హోమంత్రి అజిత్ దోవల్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన దోవల్ శీలంపూర్‌లో ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్, ఈశాన్య డీసీపీ వేదప్రకాష్ సూర్యలతో […]

Update: 2020-02-25 22:09 GMT

దిశ,వెబ్‌డెస్క్
దేశ రాజధాని ఢిల్లీ తూర్పువైపున కొనసాగుతున్నహింసాకాండను దృష్టిలో పెట్టుకుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌ను రంగంలోకి దించారు. మంగళవారం రాత్రి అమిత్ షా దోబాల్‌తో పాటు ఢిల్లీ పోలీసు అధికారులతో మూడుసార్లు సమావేశమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ హింసాకాండను అణచివేసి శాంతిభద్రతలు అదుపులోకి తీసుకురావాలని హోమంత్రి అజిత్ దోవల్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీంతో రంగంలోకి దిగిన దోవల్ శీలంపూర్‌లో ఢిల్లీ పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్, ఈశాన్య డీసీపీ వేదప్రకాష్ సూర్యలతో కలిసి శాంతిభద్రతల పరిస్థితులను సమీక్షించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో కలిసి అల్లర్లు జరిగిన మౌజ్‌పూర్, జఫరాబాద్, గోకుల్‌పురి, భాజన్‌పూర్ ప్రాంతాల్లో తిరిగి అక్కడి పరిస్థితులు, అల్లర్లో నష్టపోయిన వ్యాపారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇదిలా‌ఉండగా అల్లర్లు చెలరేగడానికి ప్రధాన కారకులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News