డబుల్ మర్డర్ నిందితుడు ఆత్మహత్య

దిశ, క్రైమ్ బ్యూరో: చాంద్రాయగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ముగ్గురు అక్కలు, బావపై అతి కిరాతకంగా దాడి చేసిన ఘటనలో నిందితుడు ఇస్మాయిల్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకేసారి ముగ్గురు అక్కలను, బావను నరికిన ఘటనలో ఇద్దరు అక్కలు అక్కడికక్కడే మరణించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న దాడిలో అక్కా, బావ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారడంతో నిందితుడు ఇస్మాయిల్ కోసం హైదరాబాద్, […]

Update: 2020-07-01 12:02 GMT
డబుల్ మర్డర్ నిందితుడు ఆత్మహత్య
  • whatsapp icon

దిశ, క్రైమ్ బ్యూరో: చాంద్రాయగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ముగ్గురు అక్కలు, బావపై అతి కిరాతకంగా దాడి చేసిన ఘటనలో నిందితుడు ఇస్మాయిల్ బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకేసారి ముగ్గురు అక్కలను, బావను నరికిన ఘటనలో ఇద్దరు అక్కలు అక్కడికక్కడే మరణించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న దాడిలో అక్కా, బావ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారడంతో నిందితుడు ఇస్మాయిల్ కోసం హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే ఏమైందో ఏమో గానీ, బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది ఇస్మాయిల్ తన భార్యను కూడా హత్య చేశాడు

Tags:    

Similar News