అగ్ర రాజ్యంలో ‘డబుల్ మాస్కింగ్’
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల యుఎస్ అధ్యక్షుడిగా జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హ్యారిస్ ప్రమాణం స్వీకారోత్సవం చేసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో, వాళ్లిద్దరితో పాటు అక్కడున్న అనేక మంది ఆఫీసర్లు, ప్రముఖులు రెండు ఫేస్ మాస్క్‌లు ధరించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించగా, కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైన నాటి నుంచి ముఖానికి రెండు మాస్క్‌లు పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నా ఎవరు అంతగా పట్టించుకోలేదు. కానీ, అమెరికా ప్రెసిడెంట్ సెర్మనీ తర్వాత ‘డబుల్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల యుఎస్ అధ్యక్షుడిగా జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హ్యారిస్ ప్రమాణం స్వీకారోత్సవం చేసిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో, వాళ్లిద్దరితో పాటు అక్కడున్న అనేక మంది ఆఫీసర్లు, ప్రముఖులు రెండు ఫేస్ మాస్క్‌లు ధరించారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించగా, కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైన నాటి నుంచి ముఖానికి రెండు మాస్క్‌లు పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నా ఎవరు అంతగా పట్టించుకోలేదు. కానీ, అమెరికా ప్రెసిడెంట్ సెర్మనీ తర్వాత ‘డబుల్ మాస్కింగ్’ అంశంపై జోరుగా చర్చ నడుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి చెందుతుండటంతో రెండు ఫేస్ మాస్క్‌లు ఉపయోగించాలని, ప్రాణాంతకమైన కొవిడ్ వైరస్‌ను సమర్థంగా నిరోధించడానికి ‘డబుల్ మాస్కింగ్’ అత్యంత ఆవశ్యకమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘అధిక నాణ్యత కలిగిన సర్జికల్ మాస్క్ ధరించి, దానిపై హై థ్రెడ్ వర్క్‌తో కూడిన రెండు పొరల ఫాబ్రిక్ మాస్క్’ ధరించడం ఉత్తమం. వైరస్ కణాలు ఒక మాస్క్ దాటి లోపలికి వచ్చినా, మరో మాస్క్ రక్షణగా పనిచేసి శరీరంలోకి ఆ కణాలను వెళ్లకుండా అడ్డుకుంటోంది’ అని పలు అధ్యయనాలు వెల్లడించాయి. మెడ్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఓ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. డబుల్ మాస్కింగ్ వల్ల 50-75 % వరకు వైరస్ నుంచి మనకు రక్షణ లభిస్తుందని మరో అధ్యయనంలో వెల్లడైంది.
విమానం, గ్రాసరీ స్టోర్, సూపర్ మార్కెట్, మార్కెట్ వంటి పబ్లిక్ ప్లేసుల్లో ‘డబుల్ మాస్కింగ్’ విధానం అద్భుతంగా పనిచేస్తుందని, ఇది పరిశోధన పూర్వకంగా రుజువైందని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాగా, రెండు కంటే ఎక్కువ మాస్క్‌లు ధరించడం మాత్రం శ్రేయస్కరం కాదని, దానివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయని మరికొందరు హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. అమెరికాలో ఇప్పటికే 25 మిలియన్ల కరోనా కేసుల నమోదయ్యాయి. 4.25 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో బైడెన్ ప్రభుత్వం ‘మాస్క్’ పెట్టుకోవడం తప్పనిసరి చేయడంతో పాటు, అమెరికన్ పౌరులకు ‘100 డేస్ మాస్కింగ్ చాలెంజ్’ విసిరారు. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్పెయిన్, ఇంగ్లాండ్ దేశాల్లో పబ్లిక్ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి చేశారు.