రంగారెడ్డిలో ఒక్క ఇల్లూ ఇయ్యలే..!

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రధాన హామీ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం. ప్రస్తుతం అధికారంలోనున్న టీఆర్ఎస్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడిచినా… ఇ ప్పటికి రంగారెడ్డి జిల్లాలో ఒక్కరికి కూడా ఇళ్లు కేటాయించిన దాఖలాలు లేవు. ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఈ ఇళ్లపై ఆశలు పెట్టుకున్నారు. మీసేవ లో దరఖాస్తు చేసుకొని కళ్లు కాయలు కా సేలా […]

Update: 2021-02-08 13:47 GMT

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రధాన హామీ డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం. ప్రస్తుతం అధికారంలోనున్న టీఆర్ఎస్ అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చి ఏడేళ్లు గడిచినా… ఇ ప్పటికి రంగారెడ్డి జిల్లాలో ఒక్కరికి కూడా ఇళ్లు కేటాయించిన దాఖలాలు లేవు. ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు ఈ ఇళ్లపై ఆశలు పెట్టుకున్నారు. మీసేవ లో దరఖాస్తు చేసుకొని కళ్లు కాయలు కా సేలా ఎదురుచూస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో సు మారుగా 25 వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇకేంత కాలం వేచిచూడాలని ప్రజలు అంటున్నారు. మొదటి దశలో అనుమతి పొందిన ఇళ్లకే ఇప్పటి వరకు అతీగతి లేదు. కేవలం 20 శాతం ఇళ్లు మాత్రమే నిర్మా దశలో ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల కోసం నిర్మించే ఇళ్లు మా త్రమే రంగారెడ్డి జిల్లా రెవెన్యూ పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారు. కానీ రంగారెడ్డి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజ లకు డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం కలగానే మిగిలిపోనుందని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి.

జిల్లాలో కేవలం 226 ఇళ్లు పూర్తి…

రంగారెడ్డి జిల్లాకు 6,645 డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ ఇళ్లు జిల్లాలోని మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు కలిపి మంజూరు చేసింది. ప్రధానంగా చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్నగర్, రాజేంద్రనగర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మాత్రమే ఈ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం అనుమతులిచ్చింది. అయితే ప్రభుత్వం కేటాయించిన 6,645 ఇళ్ల నిర్మాణానికి అధికారులు టెండర్లు పిలువగా కేవలం 3,300 ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. ఇందులో 2757 నిర్మాణ పనులు మొదలు పెట్టగా… కేవలం 226 ఇళ్లు మాత్రమే పూర్తి చేశా రు. మిగిలిన 2531 ఇళ్ల నిర్మాణ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. పట్టణ ప్రాంతంలో ఒక్కో ప్లాట్ ను రూ. 5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ.5.04 లక్షలు వ్యయంతో నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు సకా లంలో చెల్లించడం లేదని సమాచారం.

2016లో మంజూరు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను 2016లో మంజూరు చేసింది. మంజూరైన ఇళ్లకు టెండర్ పిలిచి ఖరారైన తర్వాత 2018 జూన్ 1న అప్పటి రవాణా శాఖ మంత్రి మ హేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం అజీజ్నగర్ గ్రామంలో 40 డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు. మంజూరైన రెండేళ్లకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనైన ఇళ్లు పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియని పరిస్థితి. ఇప్పటికి కొన్ని నిర్మాణానికి టెండర్లు పూర్తి కాలేదు. ఆ ఇళ్లు పూర్తి కావడం కలగానే ఉంది. పూర్తైన ఇండ్లు కేటాయించాలంటే ప్రజాప్రతినిధులకు, అధికారులకు తలనొప్పిగా మారిపోయింది.

నగరవాసుల కోసం 26 ప్రాంతాల్లో నిర్మాణం…

రంగారెడ్డి జిల్లా రెవెన్యూ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజల కోసం 26 ప్రాంతాల్లో 23,120 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. కానీ ఇదే జిల్లా ప్రజల కోసం డబూల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ముందుకు సాగకపోవడం ఇక్కడి ప్రజాప్రతినిధుల వైఫల్యమేనని ప్రతిపక్షలు విమర్శిస్తున్నారు. గ్రేటర్ వాసుల కోసం నిర్మించే ఇళ్లు పూర్తైన తర్వాత పది శాతం ఇండ్లు రంగారెడ్డి జిల్లా ప్రజలకు, స్థానికంగా అర్హత కలిగిన వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వివరిస్తున్నారు. కానీ జీహెచ్ఎసీ ప్రజాప్రతినిధులు, అధికారులు అంగీకారిస్తారా అనే ప్రశ్న జిల్లా వాసుల్లో మొదలైయింది.

Tags:    

Similar News