విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ వచ్చేసింది

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 1 నుండి 15 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ప్రకటించారు. జూలై 3 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జులై 22న సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపడతామన్నారు. రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, పాలమూరు, శాతవాహన, యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి తగిన చర్యలు చేపట్టామని […]

Update: 2021-06-29 01:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 1 నుండి 15 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ప్రకటించారు. జూలై 3 నుంచి 16 వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. జులై 22న సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపడతామన్నారు. రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, పాలమూరు, శాతవాహన, యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి తగిన చర్యలు చేపట్టామని తెలిపారు.

బిఏ, బీఎస్సీ, బీకాం, బీకాం ఒకేషనల్, బి బి ఏ, బి ఎస్ డబ్ల్యూ, బి బి ఎం, బి సి ఏ కోర్స్ లతో పాటు డి హెచ్ ఎం సి టి, డి ఫార్మసీ కోర్సులను కూడా దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తామని ప్రకటించారు. ఆధార్ నెంబర్ కు లింక్ చేసిన ఫోన్ నెంబర్ ద్వారా దోస్త్ వెబ్ సైట్ లో ఓటీపీని పొంది దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలిపారు.

Tags:    

Similar News