ఇలాంటి లింకులపై క్లిక్ చేయకండి

దిశ వెబ్‌డెస్క్: మహిళా దినోత్సవం సందర్భంగా అడిడాస్ కంపెనీ పది లక్షల మందికి ఉచితంగా చెప్పులు, షూలు అందించనుందని, ఈ లింక్‌పై క్లిక్ చేస్తే ఆఫర్ వస్తుందంటూ ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నిజమే అనుకుని చాలామంది ఈ లింకులపై క్లిక్ చేస్తున్నారు. అయితే అలాంటి లింకులపై క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి ఆఫర్స్ ఏం లేవని చెబుతున్నారు. అచ్చం అడిడాస్ కంపెనీ లోగోతో […]

Update: 2021-03-07 06:10 GMT

దిశ వెబ్‌డెస్క్: మహిళా దినోత్సవం సందర్భంగా అడిడాస్ కంపెనీ పది లక్షల మందికి ఉచితంగా చెప్పులు, షూలు అందించనుందని, ఈ లింక్‌పై క్లిక్ చేస్తే ఆఫర్ వస్తుందంటూ ఒక ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నిజమే అనుకుని చాలామంది ఈ లింకులపై క్లిక్ చేస్తున్నారు. అయితే అలాంటి లింకులపై క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాంటి ఆఫర్స్ ఏం లేవని చెబుతున్నారు.

అచ్చం అడిడాస్ కంపెనీ లోగోతో ఒక లోగో క్రియేట్ చేసి ఈ లింక్‌ను క్లిక్ చేయాలని సైబర్ నేరగాళ్లు కోరుతున్నారు. ఇలాంటి లింకు పట్ల జాగ్రత్తగా ఉండాలని, వివరాలు నమోదు చేస్తే మోసపోవడం తప్పితే.. ఆఫర్ రాదని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News