అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా ? ట్రంప్ ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షడు ట్రంప్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోస్టల్ ఓటింగ్ జరిగితే ఫలితాలు తారుమారు కావచ్చు అన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు ట్రంప్ తెలిపారు. ”ప్రజల ఆరోగ్యం సరిగ్గా, భద్రంగా, సురక్షితంగా ఓటు వేయగలిగే వరకు ఎన్నికలు ఆలస్యం?” అంటూ ఈమేరకు ట్రంప్ ట్వీట్ చేశారు. ఒకవేళ ఎన్నికలు జరిగితే ప్రజలు పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లు […]

Update: 2020-07-30 12:07 GMT

దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షడు ట్రంప్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో పోస్టల్ ఓటింగ్ జరిగితే ఫలితాలు తారుమారు కావచ్చు అన్నారు. ఈ ఏడాది నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు ట్రంప్ తెలిపారు. ”ప్రజల ఆరోగ్యం సరిగ్గా, భద్రంగా, సురక్షితంగా ఓటు వేయగలిగే వరకు ఎన్నికలు ఆలస్యం?” అంటూ ఈమేరకు ట్రంప్ ట్వీట్ చేశారు.

ఒకవేళ ఎన్నికలు జరిగితే ప్రజలు పోలింగ్ బూతులకు వచ్చి ఓట్లు వేయాల్సి ఉంటుండటంతో.. వైరస్ విజృంభించే అవకాశం ఉందని దీంతో పోస్టల్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని అమెరికాలో పలు రాష్ట్రాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోస్టల్ ఎలక్షన్‌తో ఎన్నికల ఫలితాల తప్పుగా వచ్చే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News