టిక్‌టాక్‌కు 90 రోజుల గడువు

దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా చర్చల దశలో ఉన్న టిక్‌టాక్ (Tik Tok) వ్యవహారానికి అమెరికా అధ్యక్షుడు కొంత ఊరట కలిగించారు. తాజాగా అమెరికాలో టిక్‌టాక్ కంపెనీ కార్యకలాపాలను నిలిపేయడానికి లేదంటే అమెరికా దేశానికి చెందిన కంపెనీకి విక్రయించడానికి గడువును పెంచారు. దీన్ని ఇదివరకే ఇచ్చిన 45 రోజులకు తోడు మరో 45 రోజులు పెంచి మొత్తం 90 రోజుల గడువు విధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ (Trump) సంతకం చేయడంతో టిక్‌టాక్ సంస్థకు […]

Update: 2020-08-15 05:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత కొంత కాలంగా చర్చల దశలో ఉన్న టిక్‌టాక్ (Tik Tok) వ్యవహారానికి అమెరికా అధ్యక్షుడు కొంత ఊరట కలిగించారు. తాజాగా అమెరికాలో టిక్‌టాక్ కంపెనీ కార్యకలాపాలను నిలిపేయడానికి లేదంటే అమెరికా దేశానికి చెందిన కంపెనీకి విక్రయించడానికి గడువును పెంచారు. దీన్ని ఇదివరకే ఇచ్చిన 45 రోజులకు తోడు మరో 45 రోజులు పెంచి మొత్తం 90 రోజుల గడువు విధించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ (Trump) సంతకం చేయడంతో టిక్‌టాక్ సంస్థకు నవంబర్ 12 వరకు గడువు దక్కింది.

తాజా ట్రంప్ ఉత్తర్వుల ప్రకారం.. టిక్‌టక్ (Tik Tok) సంస్థ అమెరికా కార్యకలాపాల విక్రయ ప్రక్రియను దీని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ (Bytedance) గడువులోగా పూర్తి చేయాలి. అంతేకాకుండా అమెరికా యూజర్ల డేటా (American user data)మొత్తాన్ని పూర్తిగా తొలగించాలి. అలాగే, ఈ ఊత్తర్వుల్లో అమెరికా జాతీయ భద్రత ప్రమాదం (National security risk)లో పడే అవకాశాలున్నాయని, దానికి తగిన ఆధారలు కూడా ఉన్నట్టు స్పష్టం చేశారు.

కాగా, ఇటీవల టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాల (Operations of Tik Tok America)ను కొనుగోలు చేయడానికి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) చర్చలు జరుపుతోంది. దీంతోపాటు భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కార్యకలాపాలను కూడా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ వ్యవహారం చర్చల దశలోనే ఉందని చెబుతున్నారు. మరోవైపు టిక్‌టక్ కొనుగోలుకు ట్విట్టర్ (Twitter), రిలయన్స్ (Reliance) సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News