దేశీయంగా తగ్గిన ముడి చమురు ఉత్పత్తి

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ చమురు రంగం (Oil sector)లో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఆగష్టులో దేశీయ ముడి చమురు (Crude oil) ఉత్పత్తి 6.3 శాతం క్షీణించగా, సహజ వాయువు (Natural gas) ఉత్పత్తి 9.5 శాతం దిగజారింది. ఆగస్టు నెలకు ముడి చమురు (Crude oil) ఉత్పత్తి 2.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఇందులో ప్రైవేట్ రంగ సంస్థల (Private sector companies) ఉత్పత్తి 17.5 శాతం క్షీణించగా, 11.4 శాతం ప్రభుత్వ […]

Update: 2020-09-23 08:46 GMT
దేశీయంగా తగ్గిన ముడి చమురు ఉత్పత్తి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ చమురు రంగం (Oil sector)లో కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఆగష్టులో దేశీయ ముడి చమురు (Crude oil) ఉత్పత్తి 6.3 శాతం క్షీణించగా, సహజ వాయువు (Natural gas) ఉత్పత్తి 9.5 శాతం దిగజారింది. ఆగస్టు నెలకు ముడి చమురు (Crude oil) ఉత్పత్తి 2.6 మిలియన్ మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఇందులో ప్రైవేట్ రంగ సంస్థల (Private sector companies) ఉత్పత్తి 17.5 శాతం క్షీణించగా, 11.4 శాతం ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తి తగ్గింది. ఓఎన్‌జీసీ (ONGC) క్షేత్రాల నుంచి ఉత్పత్తి దాదాపు ఫ్లాట్‌గా ఉంది.

కొత్త ఉత్పాదక క్షేత్రాలు లేకపోవడం, పాత క్షేత్రాల నుంచి రికవరీ పెంచేందుకు ప్రయత్నాలు నెమ్మదిగా ఉండటంతో చమురు ఉత్పత్తిపై భారం పెరిగింది. అలాగే, సహజవాయువు (Natural gas)ఉత్పత్తి కూడా ఆగష్టులో 9.5 శాతం పడిపోయింది. ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలానికి 13.2 శాతం తక్కువగా నమోదైంది. వివిధ రంగాలు సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఉత్పత్తిని పెంచలేకపోతున్నాయి. ప్రస్తుత ఏడాదిలో కరోనా ప్రభావం కారణంగా ప్రైవేట్ రంగ సంస్థల ఉత్పత్తి ఆలస్యంగా ప్రారంభించాయి.

దేశీయంగా సరఫరా-డిమాండ్ అంతరాన్ని తీర్చేందుకు ఆగస్టులో 5.4 శాతం గ్యాస్‌ను దిగుమతి జరిగింది. ఏప్రిల్-జూలై మధ్య మొత్తం గ్యాస్ దిగుమతి 51.1 శాతం నుంచి 53.3 శాతానికి పెరిగింది. స్థానిక శుద్ధి కర్మాగారాలు గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఆగస్టులో 26.4 శాతం తక్కువగా ప్రాసెస్ చేశాయి. ఏప్రిల్-జూన్ మధ్య ప్రాసెస్ చేసిన ముడి చమురు 22.4 శాతం తక్కువగా ఉన్నాయి. దేశీయంగా ఇంధన డిమాండ్ పడిపోవడంతో రిఫైనర్లు ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. ఇటీవల అన్‌లాక్ దశ అనంతరం దేశీయంగా డిమాండ్ పెరుగుతోంది. శుద్ధి కర్మాగారాల (Refineries)లో సామర్థ్యం పెరుగుతోంది.

Tags:    

Similar News