కరోనాను కుక్కలు పసిగట్టగలవా?

దిశ, వెబ్‌డెస్క్: మలేరియా వ్యాధిని లాబ్రడార్లు, స్పేనియల్ వంటి జాతి శునకాలు గ్రహించగలవని గతంలో శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. మరి కరోనా విషయంలో కూడా ఇవి ఏమైనా సహాయం చేయగలవా? అని తెలుసుకోవడానికి లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అధ్యాపకులు పరిశోధన చేస్తున్నారు. కరోనా మహమ్మారిలో ప్రధానంగా లక్షణాలు కనిపించకున్నా వ్యాధి వ్యాప్తి చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. వారికి రక్తపరీక్షలు, ఉమ్మి పరీక్షలు చేయకుండా నేరుగా వాసన పసిగట్టి గుర్తించగల శునకాలైతే ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రవేత్తలు ఈ దిశగా […]

Update: 2020-05-02 04:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: మలేరియా వ్యాధిని లాబ్రడార్లు, స్పేనియల్ వంటి జాతి శునకాలు గ్రహించగలవని గతంలో శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. మరి కరోనా విషయంలో కూడా ఇవి ఏమైనా సహాయం చేయగలవా? అని తెలుసుకోవడానికి లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అధ్యాపకులు పరిశోధన చేస్తున్నారు. కరోనా మహమ్మారిలో ప్రధానంగా లక్షణాలు కనిపించకున్నా వ్యాధి వ్యాప్తి చేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. వారికి రక్తపరీక్షలు, ఉమ్మి పరీక్షలు చేయకుండా నేరుగా వాసన పసిగట్టి గుర్తించగల శునకాలైతే ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధన మొదలుపెట్టారు.

క్రౌడ్ ఫండింగ్ ద్వారా తాము చేస్తున్న పరిశోధన ప్రస్తుతానికి ప్రారంభ దశల్లో ఉందని శాస్త్రవేత్త జేమ్స్ లోగన్ అన్నారు. అయితే తాము కచ్చితంగా కరోనా వైరస్ సోకిన పేషెంట్లను గుర్తించేలా కుక్కలకు శిక్షణ ఇవ్వగలమని ఆయన హామీ వ్యక్తం చేశారు. ఇప్పటికే పార్కిన్సన్స్ జబ్బు, కేన్సర్ వంటి రోగాలను శునకాలు గుర్తించగలుగుతున్నాయని, తాము గతంలో లాబ్రడార్ కుక్కలకు మలేరియాను గుర్తించేలా శిక్షణ ఇచ్చామని జేమ్స్ చెప్పారు. తమ ప్రాజెక్టు విజయవంతమైతే శునకాలను రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల వద్ద పెట్టి బయటపడని రోగులను సులభంగా గుర్తించే అవకాశం ఉండి, తద్వారా వ్యాధి వ్యాప్తిని తగ్గించే అవకాశం కలుగుతుందని వివరించారు.

Tags : corona, covid, dogs, virus, detection, london, training dogs, labradors, malaria

Tags:    

Similar News