ఐరన్ మ్యాన్ ప్లేస్‌లో డాక్టర్ స్ట్రేంజ్!

దిశ, వెబ్‌డెస్క్: అవెంజర్స్ ఎండ్‌గేమ్ తర్వాత మార్వెల్ సినిమా ప్రపంచంలో చాలా మార్పులొచ్చాయి. ఎన్నో టైమ్‌లైన్‌లు, చనిపోయిన వారిని బతికించడాలు, బతికి ఉన్న వారిని వీలైనట్లుగా ఉపయోగించుకోవడాలు ఇలా చాలా జరుగుతున్నాయి. కానీ ఎన్ని జరిగినా అందరికీ ఎంతో ఇష్టమైన ఐరన్ మ్యాన్ మాత్రం తిరిగి రావడం లేదు. దీని వల్ల స్పైడర్ మ్యాన్ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అవును.. ఇంకా కుర్రాడైన స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్‌కు ఒక మార్గదర్శి అవసరం. మొదటి సినిమా […]

Update: 2020-10-10 05:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: అవెంజర్స్ ఎండ్‌గేమ్ తర్వాత మార్వెల్ సినిమా ప్రపంచంలో చాలా మార్పులొచ్చాయి. ఎన్నో టైమ్‌లైన్‌లు, చనిపోయిన వారిని బతికించడాలు, బతికి ఉన్న వారిని వీలైనట్లుగా ఉపయోగించుకోవడాలు ఇలా చాలా జరుగుతున్నాయి. కానీ ఎన్ని జరిగినా అందరికీ ఎంతో ఇష్టమైన ఐరన్ మ్యాన్ మాత్రం తిరిగి రావడం లేదు. దీని వల్ల స్పైడర్ మ్యాన్ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అవును.. ఇంకా కుర్రాడైన స్పైడర్ మ్యాన్ పీటర్ పార్కర్‌కు ఒక మార్గదర్శి అవసరం. మొదటి సినిమా హోమ్ కమింగ్‌లో టోనీ స్టార్క్ అతనికి మార్గనిర్దేశం చేశాడు. కానీ థానోస్‌తో చేసిన యుద్ధంలో టోనీ చనిపోవడంతో రెండో సినిమా ‘ఫార్ ఫ్రమ్ హోమ్‌’లో పీటర్ ఒంటరిగా పోరాడాల్సి వచ్చింది. అందుకేనేమో తర్వాతి చిత్రంలో స్పైడర్ మ్యాన్‌కు మార్గనిర్దేశం చేయడానికి మరో మార్వెల్ హీరోను రంగంలోకి దించుతున్నారు. ఇంతకీ ఎవరా మార్వెల్ హీరో?

ఇంకెవరు? మన డాక్టర్ స్ట్రేంజ్. సమయాన్ని మానిప్యులేట్ చేయగల ఈ మాయా మాంత్రికుడు తర్వాతి ‘స్పైడర్ మ్యాన్’ సినిమాలో పీటర్ పార్కర్‌ను గైడ్ చేయనున్నాడు. మొదటి సినిమాలో ఐరన్ మ్యాన్ చేసిన పనిని ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ చేయనున్నాడు. అంటే.. తెలిసీతెలియనితనంతో పీటర్ చిక్కుల్లో పడితే ఆ చిక్కుల నుంచి రక్షించడానికి డాక్టర్ స్ట్రేంజ్ సాయం చేయబోతున్నాడన్నమాట. అయితే డాక్టర్ స్ట్రేంజ్ వల్లనే పీటర్‌కు సమస్య వస్తుందని, ఆ సమస్యను ఇద్దరూ కలిసి పరిష్కరిస్తారని కూడా కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా మరోసారి డాక్టర్ స్ట్రేంజ్‌గా బెనడిక్ట్ కంబర్‌బాచ్‌ను, పీటర్ పార్కర్‌గా టామ్ హాలెండ్‌ను ఒకే తెర మీద చూసే అవకాశం కలగబోతున్నందుకు మార్వెల్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Tags:    

Similar News