‘డాక్టర్’కు డేట్ ఫిక్స్.. సీరియస్ లుక్‌లో శివ

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‌ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘డాక్టర్’. చాలా కాలంగా డిలే అవుతూ వస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. ‘కొలమావు కోకిల’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న థియేటర్స్‌లో విడుదల కానున్నట్లుగా ప్రకటన వెలువడింది. చేతికి రక్తంతో నిండిన గ్లౌజులు, సిజర్‌తో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్న హీరో.. ఈ చిత్రంలో వయొలెన్స్, కామెడీ, మొరాలిటీస్‌తో కూడిన మిక్స్‌డ్ క్యారెక్టర్ […]

Update: 2021-02-03 02:20 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‌ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘డాక్టర్’. చాలా కాలంగా డిలే అవుతూ వస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. ‘కొలమావు కోకిల’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26న థియేటర్స్‌లో విడుదల కానున్నట్లుగా ప్రకటన వెలువడింది. చేతికి రక్తంతో నిండిన గ్లౌజులు, సిజర్‌తో సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్న హీరో.. ఈ చిత్రంలో వయొలెన్స్, కామెడీ, మొరాలిటీస్‌తో కూడిన మిక్స్‌డ్ క్యారెక్టర్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక హీరోయిన్ ప్రియాంక మోహన్‌ లాల్ ఈ చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా.. యోగిబాబు, వినయ్ ప్రధానపాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా ఫిబ్రవరి 17న హీరో పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ రిలీజయ్యే అవకాశం ఉంది.

ఇక ‘డాక్టర్‌’తో పాటు ఆర్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్‌’ చేస్తున్న శివ కార్తికేయన్.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రీసెంట్‌గా మరో ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న సినిమాకు ‘డాన్’ టైటిల్‌ ఫైనల్ కాగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma