తప్పుడు ప్రచారం చేయొద్దు: టీఎస్ఆర్టీసీ అధికారులు
దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ మెడికల్ బోర్డు సమావేశం నిర్వహించారు. సాధారణంగా రెండు నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశం కరోనా వైరస్ కారణంగా ఆలస్యంగా నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో కరోనా సోకిన ఆర్టీసీ ఉద్యోగుల చికిత్సపై ఎలాంటి చర్చ జరగేలేదని, ఆర్టీసీలో కరోనా వచ్చిన వారు సంప్రదించాల్సిన నెంబర్లుగా చెబుతూ కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు ఫోన్ నెంబర్లు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అంశాల్లో తప్పుడు సమాచారం వైరల్ […]
దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణ ఆర్టీసీ మెడికల్ బోర్డు సమావేశం నిర్వహించారు. సాధారణంగా రెండు నెలలకు ఒకసారి జరిగే ఈ సమావేశం కరోనా వైరస్ కారణంగా ఆలస్యంగా నిర్వహించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో కరోనా సోకిన ఆర్టీసీ ఉద్యోగుల చికిత్సపై ఎలాంటి చర్చ జరగేలేదని, ఆర్టీసీలో కరోనా వచ్చిన వారు సంప్రదించాల్సిన నెంబర్లుగా చెబుతూ కొంత మంది సోషల్ మీడియాలో తప్పుడు ఫోన్ నెంబర్లు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అంశాల్లో తప్పుడు సమాచారం వైరల్ చేయడం ఎంత వరకు కరక్టనేది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
తార్నాకాలోని సంస్థ ఆస్పత్రిలో రోజుకు 500 మంది దాకా ఉద్యోగుల్లోని సాధారణ రోగులకు చికిత్స అందిస్తున్నామని, జ్వరం, దగ్గుతో వచ్చిన అనుమానితులను కొవిడ్ పరీక్షా కేంద్రాలకు రిఫర్ చేస్తున్నామని అధికారులు తెలిపారు.
తార్నాకా ఆస్పత్రిలో కరోనా చికిత్స కేంద్రం ఏర్పాటు చేయాలన్నా, ప్రైవేటు రిఫరల్ ఆస్పత్రిలో ఉద్యోగులకు కరోనా ట్రీట్ మెంట్‌కు పంపాలన్నా ప్రభుత్వ అనుమతి ఉండాలని అధికారులు వివరించారు. కరోనా బారినపడి అత్యవసర పరిస్థితిలోకి వెళ్లిన ఉద్యోగులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం గాంధీ ఆస్పత్రిలోనే చికిత్సకు పంపుతున్నామని, మిగతా వారిని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోం ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని తెలిపారు. మెడికల్ బోర్డు సమావేశంలో సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ కిరణ్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ రమణ, అడ్మినిస్ట్రేషన్ ఈడీ, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.