ఉదయనిధి స్టాలిన్ అరెస్టు

చెన్నై: తమిళనాడులో డీఎంకే ఎన్నికల ప్రచార క్యాంపెయిన్‌ను ప్రారంభించడానికి ప్రయత్నించిన పార్టీ చీఫ్ స్టాలిన్ కొడుకు ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ర్యాలీ కరోనా నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ పోలీసులు డీఎంకే యూత్ వింగ్ సెక్రెటరీ ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం విడుదల చేశారు. కాగా, ఉదయనిధి అరెస్టుపై డీఎంకే శ్రేణులు మండిపడ్డాయి. ‘సీఎం ఎడప్పాడి ఎక్కడికైనా వెళ్లొచ్చు, కానీ, డీఎంకే నేతలు ఎక్కడికి వెళ్లొద్దా? డీఎంకే తొలి రోజు ప్రచారమే ఏఐఏడీఎంకే […]

Update: 2020-11-20 11:32 GMT

చెన్నై: తమిళనాడులో డీఎంకే ఎన్నికల ప్రచార క్యాంపెయిన్‌ను ప్రారంభించడానికి ప్రయత్నించిన పార్టీ చీఫ్ స్టాలిన్ కొడుకు ఉదయనిధిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ర్యాలీ కరోనా నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ పోలీసులు డీఎంకే యూత్ వింగ్ సెక్రెటరీ ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అనంతరం విడుదల చేశారు. కాగా, ఉదయనిధి అరెస్టుపై డీఎంకే శ్రేణులు మండిపడ్డాయి. ‘సీఎం ఎడప్పాడి ఎక్కడికైనా వెళ్లొచ్చు, కానీ, డీఎంకే నేతలు ఎక్కడికి వెళ్లొద్దా? డీఎంకే తొలి రోజు ప్రచారమే ఏఐఏడీఎంకే సర్కారు వెన్నులో వణుకు పుట్టించింది. ఉదయనిధి అరెస్టును ఖండిస్తున్నాను’ అని కనిమొళి ట్వీట్ చేశారు. తమిళనాడులో మరో ఆరునెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News