కార్యకర్తపై చేయిచేసుకున్న కాంగ్రెస్ చీఫ్

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఒక కార్యకర్తపై చేయిచేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ ఎంపీని పరామర్శించేందుకు మండ్యాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఒక కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించి డీకే శివకుమార్‌ను ఆనుకుని నడుస్తూ వీపుపై చేయి వేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన డీకే శివకుమార్.. కార్యకర్తపై చేయిచేసుకున్నాడు. కార్యకర్త తలపై కొట్టాడు. “చనువిచ్చింది ఇలా చేయమని […]

Update: 2021-07-10 08:06 GMT
కార్యకర్తపై చేయిచేసుకున్న కాంగ్రెస్ చీఫ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఒక కార్యకర్తపై చేయిచేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ ఎంపీని పరామర్శించేందుకు మండ్యాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఒక కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించి డీకే శివకుమార్‌ను ఆనుకుని నడుస్తూ వీపుపై చేయి వేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన డీకే శివకుమార్.. కార్యకర్తపై చేయిచేసుకున్నాడు. కార్యకర్త తలపై కొట్టాడు. “చనువిచ్చింది ఇలా చేయమని కాదు. మనమెక్కడున్నాం… నీ ప్రవర్తనేంటి?” అంటూ గట్టిగా అరిచాడు. కరోనా పరిస్థితుల్లో ఇకా ఆనుకుని నడవడంపై డీకే శివకుమార్ ఫైర్ అయ్యాడు.

Tags:    

Similar News