డబ్బులిచ్చి గ్రాడ్యుయేట్స్‌ను కొంటున్నారు: డీకే అరుణ
దిశ, గద్వాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ సర్కారు డబ్బులిచ్చి ఓట్లు కొనడం ద్వారా నీచ సాంప్రదాయానికి తెర లేపిందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. ఉద్యోగస్తులు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నారన్న విషయం తెలిసి ఎన్నికల లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. శనివారం గద్వాలలోని బిజెపి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 29% ఫిట్‌మెంట్ ఇస్తామనడం మరోసారి ఉద్యోగులను మోసం చేయడానికేనని, ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ పెట్టారో తెలపాలని ఆమె డిమాండ్ […]
దిశ, గద్వాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ సర్కారు డబ్బులిచ్చి ఓట్లు కొనడం ద్వారా నీచ సాంప్రదాయానికి తెర లేపిందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. ఉద్యోగస్తులు ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నారన్న విషయం తెలిసి ఎన్నికల లబ్ధి కోసమే సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు. శనివారం గద్వాలలోని బిజెపి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 29% ఫిట్‌మెంట్ ఇస్తామనడం మరోసారి ఉద్యోగులను మోసం చేయడానికేనని, ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు పెండింగ్ పెట్టారో తెలపాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల తర్వాత 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనడం పచ్చి అబద్ధమన్నారు. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీలుంటే కేవలం యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనడం నిరుద్యోగులను మోసం చేయడమేనని ఆమె అన్నారు. బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి కేసీఆర్ భయపడుతున్నారన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులందరూ బీజేపీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.