అందులో తప్పేముంది?.. తనిష్క్ కాంట్రవర్సీ యాడ్‌పై నటి రెస్పాన్స్

దిశ, సినిమా : గతేడాది రిలీజైన తనిష్క్ ‘హిందు ముస్లిం లవ్ స్టోరీ’ యాడ్ కాంట్రవర్సీ ఎదుర్కొంది. ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్న హిందూ అమ్మాయి గర్భవతి కావడం.. ఆ ముస్లిం కుటుంబం తనకు హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీమంతం చేయడాన్ని ఈ యాడ్‌లో చూపించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపించే ఈ యాడ్‌పై కొందరు ప్రశంసలు కురిపించినా.. ఎక్కువ మంది మాత్రం విమర్శలు గుప్పించారు. దీంతో ఆ యాడ్‌ను డిలీట్ చేసిన తనిష్క్.. క్షమాపణలు చెప్పడంతో ఆ […]

Update: 2021-04-16 06:09 GMT

దిశ, సినిమా : గతేడాది రిలీజైన తనిష్క్ ‘హిందు ముస్లిం లవ్ స్టోరీ’ యాడ్ కాంట్రవర్సీ ఎదుర్కొంది. ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్న హిందూ అమ్మాయి గర్భవతి కావడం.. ఆ ముస్లిం కుటుంబం తనకు హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీమంతం చేయడాన్ని ఈ యాడ్‌లో చూపించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని తలపించే ఈ యాడ్‌పై కొందరు ప్రశంసలు కురిపించినా.. ఎక్కువ మంది మాత్రం విమర్శలు గుప్పించారు. దీంతో ఆ యాడ్‌ను డిలీట్ చేసిన తనిష్క్.. క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం సమసిపోయింది. అయితే ఈ యాడ్‌కు నటి దివ్యా దత్త వాయిస్ అందించడం విశేషం.

కాగా లేటెస్ట్ ట్విట్టర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో ఈ యాడ్‌పై చర్చ జరిగింది. ఓ నెటిజన్ తనిష్క్ యాడ్‌కు వాయిస్ ఇచ్చింది మీరేనా అని ప్రశ్నించగా..‘అవును అది నా వాయిసే. నాకిష్టమైన యాడ్.. కానీ డిలీట్ చేశారు’ అని చెప్పింది. ఇక మరో ట్విట్టర్ యూజర్ ‘నీకు వ్యతిరేకం కాదు.. కానీ తప్పు తప్పే’ అని కామెంట్ చేశాడు. దీనికి రిప్లై ఇచ్చిన దివ్యా దత్త.. ‘కానీ సార్ మనం హిందూముస్లిం సోదరాభావాన్ని ప్రమోట్ చేయడం లేదా? ఇండియన్స్‌గా అది మన సోల్. బాల్యంలో భిన్నత్వంలో ఏకత్వం గురించి విన్నాం కదా. ఇలాంటి ప్రకటనలు కూడా చాలా ఉన్నాయి. కానీ అప్పుడెవరూ వ్యతిరేకించలేదు. కానీ ప్రతీఒక్కరికి సొంత ఆలోచనలు ఉండనివ్వండి’ అని సమాధానం ఇచ్చింది.

Tags:    

Similar News