తన పేరు బయటకు రావొద్దని కొల్లు చెప్పాడు

దిశ, వెబ్ డెస్క్: మచిలీపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత మోకా భాస్కర్ హత్యకు సంబంధించిన కేసులో రవీంద్ర అరెస్ట్ పై జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధిపత్య పోరులోనే మోకా హత్య జరిగిందని, 2013 నుంచే మోకాను హత్య చేసేందుకు నిందితులు ప్రయత్నాలు చేశారన్నారు. ఈ కేసులో కొల్లు రవీంద్ర అనుచరుడు ప్రధాన నిందితుడని, అతనితో మోకాకు విభేదాలు ఉన్నాయని, మార్కెట్ కు వచ్చిన మోకాను పక్కా ప్లాన్ తో […]

Update: 2020-07-04 01:55 GMT

దిశ, వెబ్ డెస్క్: మచిలీపట్నానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత మోకా భాస్కర్ హత్యకు సంబంధించిన కేసులో రవీంద్ర అరెస్ట్ పై జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధిపత్య పోరులోనే మోకా హత్య జరిగిందని, 2013 నుంచే మోకాను హత్య చేసేందుకు నిందితులు ప్రయత్నాలు చేశారన్నారు. ఈ కేసులో కొల్లు రవీంద్ర అనుచరుడు ప్రధాన నిందితుడని, అతనితో మోకాకు విభేదాలు ఉన్నాయని, మార్కెట్ కు వచ్చిన మోకాను పక్కా ప్లాన్ తో హత్య చేశారని ఎస్పీ వెల్లడించారు. మోకాను హత్య చేస్తామని కొల్లు రవీంద్రకు చెప్పారని, ఆ సమయంలో ప్లాన్ మిస్ అవ్వకూడదని, అదేవిధంగా తన పేరు కూడా ఎక్కడా బయటకు రావొద్దని ముద్దాయితో కొల్లు రవీంద్ర అన్నట్లు ఎస్పీ చెప్పారు. హత్య తరువాత నాంచారయ్య వేరే ఫోన్ తో కొల్లు రవీంద్ర పీఏకు కాల్ చేశారని, మోకా హత్య ప్లానింగ్ లో కొల్లు రవీంద్ర భాగస్వామి అని, నిందితుల కాల్ డేటాను పరిశీలించామని ఎస్పీ తెలిపారు. కొల్లు రవీంద్రను జడ్జి ముందు ప్రవేశపెట్టామని ఎస్పీ వివరాలు వెల్లడించారు.

Tags:    

Similar News