సీఎం కేసీఆర్ సమీక్షిస్తేనే టీకా
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టిన తరువాతే రాష్ట్రంలో తిరిగి టీకా పంపిణీలు ప్రారంభం కానున్నాయి. ఈటల రాజేందర్ తొలగింపు అనంతరం వైద్యారోగ్యశాఖను సీఎం కేసీఆర్ తన పరిధిలోకి తీసుకున్నారు. దీంతో వైద్యారోగ్యశాఖలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న సీఎం కేసీఆర్ అనుమతి తప్పనిసరిగా మారింది. ఇప్పటికే రెండు రోజుల నుంచి వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేయడంతో తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రానికి ఇప్పటి వరకు 48,82,830 డోసుల టీకా సరఫరా చేయగా, వీటిలో […]
దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టిన తరువాతే రాష్ట్రంలో తిరిగి టీకా పంపిణీలు ప్రారంభం కానున్నాయి. ఈటల రాజేందర్ తొలగింపు అనంతరం వైద్యారోగ్యశాఖను సీఎం కేసీఆర్ తన పరిధిలోకి తీసుకున్నారు. దీంతో వైద్యారోగ్యశాఖలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న సీఎం కేసీఆర్ అనుమతి తప్పనిసరిగా మారింది. ఇప్పటికే రెండు రోజుల నుంచి వ్యాక్సిన్ పంపిణీని నిలిపివేయడంతో తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
రాష్ట్రానికి ఇప్పటి వరకు 48,82,830 డోసుల టీకా సరఫరా చేయగా, వీటిలో మొదటి డోసు టీకాను 41,49,598 మందికి, రెండవ డోసు టీకాను 6,24,146 మందికి పంపిణీ చేపట్టారు. రాష్ట్రంలో మొత్తం 1216 టీకా పంపిణీ సెంటర్లను ఏర్పాటు చేశారు.
సీఎం కేసీఆర్ వస్తేనే టీకా
వైద్యారోగ్య శాఖ నుంచి ఈటల రాజేందర్‌ను తప్పించిన అనంతరం గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ ఆ శాఖను సీఎం కేసీఆర్‌కు అప్పగించారు. దీంతో వైద్యారోగ్య శాఖలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా, టీకాను పంపిణీ చేయాలన్నా సీఎం కేసీఆర్ తప్పని సరిగా అధికారులతో సమీక్షలు చేపట్టాల్సి వస్తుంది. కరోనాతో ఫాం హౌజ్‌లో చికిత్స పొందుతున్న ఆయనకు ఇప్పటికి రెండు సార్లు పరీక్షలు నిర్వహించినా నెగిటివ్ రిపోర్ట్ రాకపోవడంతో మరిన్ని రోజులు ఐసోలేషన్‌లోనే ఉండాల్సి పరిస్థితి ఏర్పడింది. మరోసారి ఆయనకు ఆర్‌టీ పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తే రిపోర్ట్ వచ్చే సరికి కనీసం 2 రోజుల సమయం పట్టే అవకాశాలున్నాయి. కరోనా నుంచి కోలుకొని పూర్తి ఆరోగ్యవంతులుగా వచ్చేంత వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుకాదు. దీంతో టీకా పంపిణీ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమవుతుందనే అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
ఇప్పటికే మొదటి డోసు టీకాను తీసుకొని 28 రోజులు గడిచిన వారి సంఖ్య అధికమవుతుంది. వారందరూ రెండవ డోసు కోసం ఎదురుచూస్తున్నారు. ఆలస్యమైతే ఏమైనా దుష్పరిణామాలు తలెత్తుతాయనే ఆందోళనలు వారిలో కలుగుతున్నాయి. శనివారం రాష్ట్రానికి 1.5 లక్షల స్పూత్నిక్ వ్యాక్సిన్ దిగుమతి కాగా, వీటిలో ఎవరి వాటాలు ఎంతనే అంశాలు నిర్ణయం కాకపోవడంతో టీకా వచ్చినా కాని పంపిణీ చేపట్టే అవకాశాలు లేకుండా పోయాయి.
18 నుంచి 44 ఏళ్ల లోపు వయసు వారు 1.75 కోట్ల మంది ఉండగా వీరందరికి 3.5కోట్ల డోసుల వరకు టీకాలు అవసరమవుతాయి. కాని కేంద్ర ప్రభుత్వం కేవలం 4.4లక్షల డోసులు మాత్రమే మే మొదటి వారం కోసం కేటాయించిందని సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాల వలనే వ్యాక్సిన్ పంపిణీలో తలెత్తుతున్న అనుమానాలు తొలిగిపోనున్నాయి. అప్పటి వరకు వేచిచూడాల్సిందే.