నాగార్జున సాగర్‌లో క్రీడాకారులకు దుస్తుల పంపిణీ

దిశ, నాగార్జునసాగర్: రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల బాలబాలికలకు టీఆర్ఎస్ నేత కర్ణ బ్రహ్మానందారెడ్డి దుస్తులు, ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులందరూ చదువుతోపాటు క్రీడల్లో ముందుండాలని సూచించారు. క్రీడల వల్ల దేహదారుఢ్యంతో పాటు శారీరక రుగ్మతలు తొలగిపోతాయన్నారు. ప్రతీ విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా […]

Update: 2021-11-26 03:04 GMT

దిశ, నాగార్జునసాగర్: రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికైన నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ పాఠశాల బాలబాలికలకు టీఆర్ఎస్ నేత కర్ణ బ్రహ్మానందారెడ్డి దుస్తులు, ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులందరూ చదువుతోపాటు క్రీడల్లో ముందుండాలని సూచించారు. క్రీడల వల్ల దేహదారుఢ్యంతో పాటు శారీరక రుగ్మతలు తొలగిపోతాయన్నారు. ప్రతీ విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సాగర్ పట్టణ అధ్యక్షుడు రమావత్ మోహన్ నాయక్, పాఠశాల కరస్పాండెంట్ జోస్మిన్, ప్రిన్సిపాల్ విజయ ప్రభావతి, ఉపాధ్యాయులు హనుమ కుమార్, కిరణ్ కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News