జూన్ 15 నుంచి రైతుబంధు నిధులు పంపిణీ
దిశ, వెబ్‌డెస్క్: జూన్ 15 నుంచి రైతుబంధు డబ్బులు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు. జూన్ 10వరకు పట్టాదార్ పాస్‌బుక్‌లు పొందిన సీసీఎల్‌ఎ ద్వారా ధరణి పోర్టల్‌లో చేర్చబడిన రైతులుందరికీ రైతుబంధు డబ్బులు జమ చేస్తామన్నారు. రైతులు తమ బ్యాంకు అకౌంట్, పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు వివరాలను వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలని నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు బంధు […]
దిశ, వెబ్‌డెస్క్: జూన్ 15 నుంచి రైతుబంధు డబ్బులు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు. జూన్ 10వరకు పట్టాదార్ పాస్‌బుక్‌లు పొందిన సీసీఎల్‌ఎ ద్వారా ధరణి పోర్టల్‌లో చేర్చబడిన రైతులుందరికీ రైతుబంధు డబ్బులు జమ చేస్తామన్నారు. రైతులు తమ బ్యాంకు అకౌంట్, పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డు వివరాలను వ్యవసాయశాఖ అధికారులకు అందజేయాలని నిరంజన్ రెడ్డి తెలిపారు.
రైతు బంధు నిధులకు సంబంధించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన రైతులందరికీ డబ్బులు వస్తాయన్నారు. మొదటిసారి పట్టాదార్ పాస్‌బుక్ పొందిన రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారని, వారి అకౌంట్లలో కూడా డబ్బులు జమ చేస్తామన్నారు.