డివిజన్​కు రూ. 5 కోట్లు ?

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటమి అంచున ఉన్నట్లు తెలిసిపోయిందని. అందకే డివిజన్‌కు రూ.5 కోట్లు సంచుతుందని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి ఆరోపించారు. ఆ సొమ్మును డివిజన్​ అభివృద్ధి కోసం వెచ్చించినా బాగుండేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే పార్టీకే ప్రజలు మద్దతివ్వాలని కోరారు. గాంధీభవన్​లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగిందని, ఈ విషయాన్ని ఓటర్లు గుర్తించుకోవాలని కోరారు. టీఆర్ఎస్ అభివృద్ధిని మరచిపోయిందని, కేవలం హామీలకే […]

Update: 2020-11-30 05:59 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రేటర్​ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటమి అంచున ఉన్నట్లు తెలిసిపోయిందని. అందకే డివిజన్‌కు రూ.5 కోట్లు సంచుతుందని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి ఆరోపించారు. ఆ సొమ్మును డివిజన్​ అభివృద్ధి కోసం వెచ్చించినా బాగుండేదన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అభివృద్ధి చేసే పార్టీకే ప్రజలు మద్దతివ్వాలని కోరారు. గాంధీభవన్​లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగిందని, ఈ విషయాన్ని ఓటర్లు గుర్తించుకోవాలని కోరారు. టీఆర్ఎస్ అభివృద్ధిని మరచిపోయిందని, కేవలం హామీలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. గత గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదని చెప్పారు. కొత్తగా ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News