సత్తా చాటండి.. రూ. 48 వేలు తీసుకోండి: తల్లోజు

దిశ, ఆమనగల్లు: విద్యార్థుల్లో ఎంతటి ప్రతిభ ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్నారని.. అటువంటివారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పేరిట ఉపకారవేతనం అందిస్తోందని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఎనిమిదవ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి […]

Update: 2021-12-09 05:02 GMT

దిశ, ఆమనగల్లు: విద్యార్థుల్లో ఎంతటి ప్రతిభ ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యకు దూరమవుతున్నారని.. అటువంటివారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పేరిట ఉపకారవేతనం అందిస్తోందని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఎనిమిదవ తరగతి విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యూత్ ఫర్ సేవ ఆధ్వర్యంలో విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

యూత్ ఫర్ సేవ కో-ఆర్డినేటర్ కడారి శ్రీశైలం, మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, వైస్ చైర్మన్ దుర్గయ్య, పాఠశాల సిబ్బందితో కలిసి విద్యార్థులకు మెటీరియల్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆచారి మాట్లాడుతూ NMMS ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా వెయ్యి రూపాయల చొప్పున నాలుగు సంవత్సరాలపాటు అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయులు శ్రీధర్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అనసూయ, కౌన్సిలర్లు చెక్కల లక్ష్మణ్, కృష్ణ యాదవ్, విజయ్ కృష్ణ, శ్రీధర్, బీజేపీ నాయకులు రాంరెడ్డి, గోరటి నర్సింహా, రాములు యాదగిరి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News