ఎడ్ల బండిపై వాగులు దాటి… గ్రామంలో నిత్యావసరాల పంపిణీ

దిశ ప్రతినిధి, కరీంనగర్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మారుమూల గ్రామాలు వరదల్లో చిక్కుకుని భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్మెల మండలం మోదేడు గ్రామం జల దిగ్భందనంలో చిక్కుకుంది. దీంతో ఆదివారం గ్రామంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, భూపాలపల్లి చైర్ పర్సన్ జక్కు శ్రీ, హర్షిణీలు పర్యటించారు. బురదమయమైన రోడ్లు, నీటితో నిండిన వాగులు వంకలను ఎండ్లబండి సాయంతో దాటుకుంటూ ఇవాళ ఆ పల్లెకు చేరారు. ఈ […]

Update: 2020-08-23 04:27 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: గతకొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు మారుమూల గ్రామాలు వరదల్లో చిక్కుకుని భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పల్మెల మండలం మోదేడు గ్రామం జల దిగ్భందనంలో చిక్కుకుంది. దీంతో ఆదివారం గ్రామంలో జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, భూపాలపల్లి చైర్ పర్సన్ జక్కు శ్రీ, హర్షిణీలు పర్యటించారు.

బురదమయమైన రోడ్లు, నీటితో నిండిన వాగులు వంకలను ఎండ్లబండి సాయంతో దాటుకుంటూ ఇవాళ ఆ పల్లెకు చేరారు. ఈ గ్రామానికి మధ్యన ఉన్న వాగు పొంగిపొర్లుతుండడంతో బాహ్య ప్రపంచానికి సంబంధాలు లేకుండా పోయాయి. అనంతరం వారు గ్రామంలో ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.

Tags:    

Similar News