మట్టి వినాయకుడినే పూజించాలి

దిశ, న్యూస్‌బ్యూరో: పర్యావరణ పరిరక్షణ కోసం భక్తి శ్రద్దలతో మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ (హెచ్.ఎం.డి.ఏ) కార్యదర్శి బి.ఎం.సంతోష్ కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో హెచ్.ఎం.డి.ఏ ఉచిత మట్టి గణపతి విగ్రహాలతో పాటు తులసి, లేమన్ గ్రాస్ మొక్కలను మీడియా ప్రతినిధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనాల వినియోగంతో తయారుచేసిన వినాయక విగ్రహాల వల్ల జరిగే నష్టాలను వివరించారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం […]

Update: 2020-08-19 08:16 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: పర్యావరణ పరిరక్షణ కోసం భక్తి శ్రద్దలతో మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ (హెచ్.ఎం.డి.ఏ) కార్యదర్శి బి.ఎం.సంతోష్ కోరారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో హెచ్.ఎం.డి.ఏ ఉచిత మట్టి గణపతి విగ్రహాలతో పాటు తులసి, లేమన్ గ్రాస్ మొక్కలను మీడియా ప్రతినిధులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనాల వినియోగంతో తయారుచేసిన వినాయక విగ్రహాల వల్ల జరిగే నష్టాలను వివరించారు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

Tags:    

Similar News