90 కోట్ల చేపల పిల్లల పంపిణీ చేశాం : తలసాని

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది 28,968 చెరువుల్లో 90 కోట్ల చేప పిల్లను విడుదల చేసేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 కోట్ల రొయ్యపిల్లను విడుదల చేసేందుకు అనువైన చెరువులను గుర్తించాలని అధికారులకు సూచించారు. గత ఏడాది 18,335 […]

Update: 2021-04-26 07:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఈ ఏడాది 28,968 చెరువుల్లో 90 కోట్ల చేప పిల్లను విడుదల చేసేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 6 కోట్ల రొయ్యపిల్లను విడుదల చేసేందుకు అనువైన చెరువులను గుర్తించాలని అధికారులకు సూచించారు.

గత ఏడాది 18,335 చెరువుల్లో 68.52 కోట్ల చేప పిల్లలు, 93 చెరువులలో 4 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. చేప పిల్లల సేకరణ కోసం చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల సందర్శించి కొనుగోలు చేసేందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో 34,024 చెరువులు ఉండగా ఇందులో చేపల పెంపకానికి అనువుగా ఉండే 28,968 చెరువులకు జియోట్యాగింగ్ చేయడం జరిగిందని వివరించారు. మిగిలిన చెరువులకు జియోట్యాగింగ్ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లల ఉత్పత్తి స్థానికంగానే చేపట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

రాష్ట్రంలో హోల్ సేల్ చేపల మార్కెట్, ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన ముందుస్తు చర్యల వలన సరిపడినంత పశుగ్రాసాన్ని సమీకరించుకోగలిగామని తెలిపారు. జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించి గడ్డి పెంపకాన్ని చేపట్టాలని ఆదేశించారు. గడ్డి విత్తనాలు ఎన్ని టన్నులు అవసరమవుతాయనే నివేదికలను సిద్ధం చేయాలని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పశువైద్యశాలల అభివృద్ధి, ఆధునీకరణ పనులను త్వరలోనే చేపట్టడం జరుగుతుందని ప్రకటించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోవాలని, ఆసుపత్రుల పనితీరును సమీక్షించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లు పాల్గొన్నారు.

Tags:    

Similar News