అక్కడ బాగలేదు.. అందుకే బయటకొచ్చా: కరోనా పేషెంట్

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లా కోవిడః-19 క్వారంటైన్ కేంద్రాల్లో అందుతున్న సేవ‌లు, రోగుల‌పై జ‌రుగుతున్న నిర్ల‌క్ష్యం మ‌రోసారి బ‌హిర్గ‌త‌మైంది. అన్నం ఫౌండేష‌న్ అనాథల‌ ఆశ్ర‌మ నిర్వాహకుడు అన్నం శ్రీనివాస‌రావుకు నాలుగు రోజుల క్రితం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌నను అధికారులు వెంట‌నే ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లించారు. అయితే క్వారంటైన్ కేంద్రంలో దుర్భర పరిస్థితులు నెల‌కొన్నాయ‌ని, అక్క‌డ రోగుల‌ను ప‌ట్టించుకునే వారు లేరని ఆవేద‌న వ్య‌క్తం […]

Update: 2020-07-26 23:14 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: ఖ‌మ్మం జిల్లా కోవిడః-19 క్వారంటైన్ కేంద్రాల్లో అందుతున్న సేవ‌లు, రోగుల‌పై జ‌రుగుతున్న నిర్ల‌క్ష్యం మ‌రోసారి బ‌హిర్గ‌త‌మైంది. అన్నం ఫౌండేష‌న్ అనాథల‌ ఆశ్ర‌మ నిర్వాహకుడు అన్నం శ్రీనివాస‌రావుకు నాలుగు రోజుల క్రితం క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌నను అధికారులు వెంట‌నే ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం మద్దులపల్లిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రానికి త‌ర‌లించారు. అయితే క్వారంటైన్ కేంద్రంలో దుర్భర పరిస్థితులు నెల‌కొన్నాయ‌ని, అక్క‌డ రోగుల‌ను ప‌ట్టించుకునే వారు లేరని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనికి తోడు కేంద్రంలో పారిశుధ్యం పేరుకుపోతోంద‌ని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా మీడియా ప్ర‌తినిధుల‌కు ఆయ‌న సోమ‌వారం ఉద‌యం పంపించారు. అక్క‌డ ఉంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని భావించి వైద్యాధికారుల అనుమ‌తిత‌తో ఆశ్ర‌మంలోనే హోం ఐసోలేష‌న్‌లో కొన‌సాగుతున్న‌ట్లు తెలిపారు. తనకు మెరుగైన వైద్యం అందించాలంటూ వేడుకుంటున్నాడు.

Tags:    

Similar News