‘నూతన పెట్టుబడుల విధానంతో ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పన’

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ కొత్త పెట్టుబడుల విధానం విస్తృతమైన ఆర్థిక లోటును పూడ్చకుండా ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఉందని ప్రభుత్వ పెట్టుబడుల కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. బడ్జెట్-2021లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున చర్చ వస్తున్నందున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి మధ్య ప్రభుత్వ వ్యయం పెరగడంతో ఆదాయాలు ప్రభావితమయ్యాయని, ఇది భారీ ఆర్థికలోటుకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా ప్రైవేటీకరణతో 1991 నాటి సరళీకరణ […]

Update: 2021-02-07 09:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ కొత్త పెట్టుబడుల విధానం విస్తృతమైన ఆర్థిక లోటును పూడ్చకుండా ఆర్థికవృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఉందని ప్రభుత్వ పెట్టుబడుల కార్యదర్శి తుహిన్ కాంత పాండే తెలిపారు. బడ్జెట్-2021లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున చర్చ వస్తున్నందున ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి మధ్య ప్రభుత్వ వ్యయం పెరగడంతో ఆదాయాలు ప్రభావితమయ్యాయని, ఇది భారీ ఆర్థికలోటుకు దారితీసిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా ప్రైవేటీకరణతో 1991 నాటి సరళీకరణ సంస్కరణలను పూర్తి చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘ప్రస్తుతం నూతన దశలో ఉన్నాం. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అనిశ్చితి కారణంగా గతేడాది పెట్టుబడిదారుల మనోభావాలు క్షీణించాయని, ఇప్పుడు పెట్టుబడులు రావడం మొదలయ్యాయని ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(దీపమ్) కార్యదర్శి తుహిన్ కాంత పాండే వివరించారు. నూతన పెట్టుబడుల విధానం వనరులను సాధించే విధానం కాదు, వృద్ధిని పెంచేవని ఆయన చెప్పారు. కాగా, రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ. 1.75 లక్షల కోట్ల ప్రభుత్వ పెట్టుబడుల లక్ష్యం అని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News