ఆర్జీవీ సినిమాపై కోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి

దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనపై సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే విడుదల చేసి, అందరినీ ఆకర్షించాడు. తాజాగా ఈ మూవీని ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు శుక్రవారం విచారించారు. ఈ మూవీ నిర్మాణం చేపట్టడం సరికాదని […]

Update: 2020-10-09 23:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనపై సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఇప్పటికే విడుదల చేసి, అందరినీ ఆకర్షించాడు. తాజాగా ఈ మూవీని ఆపేలా కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డును ఆదేశించాలంటూ దిశ తండ్రి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు శుక్రవారం విచారించారు. ఈ మూవీ నిర్మాణం చేపట్టడం సరికాదని దిశ తండ్రి తరపు న్యాయవాది, కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి.. దిశ తండ్రి ఇచ్చే వినతిపత్రంపై కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

Tags:    

Similar News