దిశ ఎఫెక్ట్: మహిళా పోలీసుకు భారీ జరిమానా

దిశ, ఖమ్మం ప్రతినిది: ఈ చిత్రం చూడండి.. ఎన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు కన్పిస్తున్నాయో..? ఎంత నిర్లక్ష్యం రాజ్యమేలుతుందో..? ఒక్క బైకు మీద ముగ్గురు ప్రయాణించడమే పెద్దతప్పు.. అలాంటిది అందులోని ఇద్దరూ సెల్‌ఫోన్ మాట్లాడుతున్నారు. అంతేగాకుండా.. మధ్యలో కూర్చున్న ఆమె డ్రైవింగ్ చేస్తున్న వారి చెవిలో ఫోన్ పెట్టి మరీ మాట్లాడిస్తోంది. కనీసం హెల్మెట్ కూడా లేకుండా నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తున్న వీళ్లు ఎవరు అనుకుంటున్నారా? సాక్షాత్తు పోలీసులు. ఈనెల 9వ తేదీన వైఎస్ షర్మిల సంకల్ప సభలో […]

Update: 2021-04-11 06:05 GMT

దిశ, ఖమ్మం ప్రతినిది: ఈ చిత్రం చూడండి.. ఎన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలు కన్పిస్తున్నాయో..? ఎంత నిర్లక్ష్యం రాజ్యమేలుతుందో..? ఒక్క బైకు మీద ముగ్గురు ప్రయాణించడమే పెద్దతప్పు.. అలాంటిది అందులోని ఇద్దరూ సెల్‌ఫోన్ మాట్లాడుతున్నారు. అంతేగాకుండా.. మధ్యలో కూర్చున్న ఆమె డ్రైవింగ్ చేస్తున్న వారి చెవిలో ఫోన్ పెట్టి మరీ మాట్లాడిస్తోంది. కనీసం హెల్మెట్ కూడా లేకుండా నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా కనిపిస్తున్న వీళ్లు ఎవరు అనుకుంటున్నారా? సాక్షాత్తు పోలీసులు. ఈనెల 9వ తేదీన వైఎస్ షర్మిల సంకల్ప సభలో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఒకే బైకుపై, హెల్మెట్ లేకుండా, ఫోన్ మాట్లాడుకుంటూ, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు. దీనిని గమనించిన ‘దిశ’ పత్రిక ప్రతినిధి ఫోటో తీసి పేపర్లో ప్రచురించారు. దీంతో ఆ ముగ్గురు మహిళా పోలీసులకు ట్రాఫిక్ పోలీసులు రూ.3300 జరిమానా విధించారు. ట్రిపుల్ రైడింగ్‌పై సిరియస్ అయిన పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ బాధ్యతారాహితంగా వ్యవహరించిన ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లపై శాఖపరమైన చర్యలకు ఆదేశించారు.

Tags:    

Similar News