‘కిస్ మీ మోర్’ అంటున్న దిశా పటానీ.. వీడియో వైరల్
దిశ, సినిమా : లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ‘రాధే’లో సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించిన డాన్సింగ్ క్వీన్ దిశా పటానీ.. యూనిక్ డ్యాన్స్ మూవ్స్‌తో చేసిన షార్ట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో అమెరికన్ పాప్ సింగర్ డోజా క్యాట్ ‘కిస్ మీ మోర్’ పాటకు దిశా వేసిన స్టెప్పులు వైరల్‌గా మారాయి. ఈ మేరకు తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్, అతని తల్లి ఆయేషా ష్రాఫ్, సోదరి కృష్ణ ష్రాఫ్‌తో పాటు […]
దిశ, సినిమా : లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ ‘రాధే’లో సల్మాన్ ఖాన్‌కు జోడీగా నటించిన డాన్సింగ్ క్వీన్ దిశా పటానీ.. యూనిక్ డ్యాన్స్ మూవ్స్‌తో చేసిన షార్ట్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో అమెరికన్ పాప్ సింగర్ డోజా క్యాట్ ‘కిస్ మీ మోర్’ పాటకు దిశా వేసిన స్టెప్పులు వైరల్‌గా మారాయి. ఈ మేరకు తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ టైగర్ ష్రాఫ్, అతని తల్లి ఆయేషా ష్రాఫ్, సోదరి కృష్ణ ష్రాఫ్‌తో పాటు నెటిజన్ల నుంచి తనకు కాంప్లిమెంట్స్ అందాయి.
ఈ క్రమంలో కూల్ పర్ఫార్మెన్స్ అని కామెంట్ చేసిన టైగర్ ష్రాఫ్.. హార్ట్ ఐస్, ఫైర్ ఎమోజీస్ పోస్ట్ చేశాడు. ఇక దిశా సోదరి ఖుష్బూ పటానీ..‘యే యే’ అంటూ హార్ట్ ఎమోజీస్ యాడ్ చేసింది. అంతేకాదు దిశా డ్యాన్స్ మూవ్స్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్.. ‘డ్యాన్స్ ఫ్లోర్‌ను ఫైర్ మోడ్‌లో సెట్ చేశావు’ అని తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ బీటౌన్ బ్యూటీ ప్రస్తుతం మోహిత్ సూరి డైరెక్షన్‌లో వస్తున్న ‘ఏక్ విలన్ రిటర్న్స్’లో నటిస్తోంది. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తార సుతారియా లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న సినిమా 2022 ఫిబ్రవరి11న రిలీజ్ కానుంది.