‘దిశ’ఊపిరి పోయింది ఇక్కడ..‘దిశ చట్టం’పుట్టింది అక్కడ!

         దురాగతం సంభవించింది తెలంగాణలో. పదునైన చట్టం పురుడుపోసుకున్నది ఏపీలో! మన వద్ద కఠిన చట్టాలు లేవనీ కాదు. కానీ, అప్‌డేటెడ్ కమ్ అడ్వాన్స్‌డ్ చట్టాన్ని ఆంధ్రా అందిపుచ్చుకున్నది. లేడీస్‌‌పై నేరాల కేసులను గరిష్టంగా నెల రోజుల్లోనే పరిష్కరించేలా ఏపీ దిశ చట్టం తెచ్చింది. దానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సాంకేతిక సవరణలు సూచించింది. అది వేరే విషయం. కానీ, ఆంధ్రా సర్కార్ షార్పుగా రియాక్టయి, ఏకంగా ‘దిశ’పేరిటే చట్టాన్నీ ప్లస్ పోలీసు […]

Update: 2020-02-08 05:49 GMT

దురాగతం సంభవించింది తెలంగాణలో. పదునైన చట్టం పురుడుపోసుకున్నది ఏపీలో! మన వద్ద కఠిన చట్టాలు లేవనీ కాదు. కానీ, అప్‌డేటెడ్ కమ్ అడ్వాన్స్‌డ్ చట్టాన్ని ఆంధ్రా అందిపుచ్చుకున్నది. లేడీస్‌‌పై నేరాల కేసులను గరిష్టంగా నెల రోజుల్లోనే పరిష్కరించేలా ఏపీ దిశ చట్టం తెచ్చింది. దానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సాంకేతిక సవరణలు సూచించింది. అది వేరే విషయం. కానీ, ఆంధ్రా సర్కార్ షార్పుగా రియాక్టయి, ఏకంగా ‘దిశ’పేరిటే చట్టాన్నీ ప్లస్ పోలీసు స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నది. తూ.గో. జిల్లా రాజమహేంద్రవరంలో దిశ పోలీసు స్టేషన్‌ను సీఎం జగన్ ఇవాళ ఓపెన్ చేశారు. మరో 18 చోట్ల రెడీ చేయిస్తున్నారు. అలాగే దిశ యాప్‌నూ ఇంట్రడ్యూస్ చేశారు. యాప్ టెస్ట్ వాడకంతో ఫైవ్ మినట్స్‌లోనే పోలీసులు ప్రత్యక్షమయ్యారు. సో, ఏపీలో అట్లా చకచకా దిశ నిర్దేశం జరిగిపోతున్నది.

సీసీ కెమెరాల పరంగా దేశంలో మనమే ఫస్ట్, అలాంటిది..

నిరుడి గణాంకాల మేరకు..టోటల్ ఇండియాలో 4,27,529 సీసీ కెమెరాలున్నాయి. వాటిల్లో అత్యధికంగా 2,75,528 సీసీ కెమెరాలున్నది తెలంగాణలోనే. అంటే దాదాపు 65 శాతం అన్నమాట. దేశంలో 63 పోలీస్ కమిషనరేట్లుండగా, ఒక మన రాష్ట్రంలోనే వాటి సంఖ్య 9. మహారాష్ట్ర తర్వాత మనదే హయ్యెస్ట్. అట్లాంటి తెలంగాణలో, అదీ..రాజధాని చెంతన చెప్పలేని అకృత్యాలకు ‘దిశ’కాలి‘పోయింది’. ఆ ఉదంతం తెలంగాణకు మాయని మచ్చయింది. యాక్చువల్‌గానైతే నిందితులు ఎన్‌కౌంటర్ అయ్యారు కాబట్టి, అక్కడికి సరిపోయింది! లేదంటే, పరిస్థితి మరోలా ఉండేదేమో!

ఆంధ్రా అలెర్ట్..!

అంతేలేని ఆ అమానుషంతో అందరికంటే ముందు ఆంధ్రా అలెర్ట్ అయింది. బ్యూరోక్రాట్లు బుర్రకు పని చెప్పారు. ఉన్నంతలో విరుగుడును కనిపెట్టారు. విధానపరంగా సమయానుకూల నిర్ణయాలకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. చట్టానికి పదునైన కోరలు తొడిగింది. ఫటాఫట్ పని కానిచ్చేసింది. చూస్తుండగానే దిశ చట్టం రూపుదాల్చింది. ఇక్కడ నిస్సహాయ స్థితిలో దిశ ఊపిరి విడిస్తే..అక్కడ దిశ చట్టం ఊపిరి పోసుకుంది! దేశానికే మార్గదర్శనం చేసింది. దేశంలోనే నెంబర్ వన్‌గా చెప్పుకొనే తెలంగాణ పాలకులూ ఏపీ యాక్టివ్‌నెస్‌ను చూస్తుండొచ్చు! చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ను ఉటంకిస్తూ, టీఎస్ సీఎం కేసీఆర్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ పదే పదే మెచ్చుకున్నారు.

Tags:    

Similar News