శంషాబాద్‌లోని అక్రమ నిర్మాణాలపై దిశ ఎఫెక్ట్
దిశ, శంషాబాద్: అక్రమ నిర్మాణాలపై బుధవారం దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి.. శంషాబాద్ మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక అధికారి శ్రీనివాస్ స్పందించారు. వెంటనే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సామ ఎంక్లేవ్‌లో అధికార పార్టీ కౌన్సిలర్ అక్రమంగా నిర్మించిన భవనం దగ్గరికి వెళ్లి పనులను నిలిపివేశారు. మరోసారి అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై 9 మంది బిల్ కలెక్టర్లతో కమిటీ వేయడం జరిగిందని మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని […]
దిశ, శంషాబాద్: అక్రమ నిర్మాణాలపై బుధవారం దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి.. శంషాబాద్ మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక అధికారి శ్రీనివాస్ స్పందించారు. వెంటనే శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సామ ఎంక్లేవ్‌లో అధికార పార్టీ కౌన్సిలర్ అక్రమంగా నిర్మించిన భవనం దగ్గరికి వెళ్లి పనులను నిలిపివేశారు. మరోసారి అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై 9 మంది బిల్ కలెక్టర్లతో కమిటీ వేయడం జరిగిందని మున్సిపాలిటీ పరిధిలో ఎన్ని అక్రమ నిర్మాణాలు చేపట్టారు.. పూర్తిగా వివరాలు సేకరించిన అనంతరం డిస్ట్రిక్ టాస్క్‌ఫోర్స్ కమిటీకి నివేదిక అందజేస్తామన్నారు. అనంతరం డిస్ట్రిక్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఆదేశాల మేరకు కూల్చివేతలు చేస్తామన్నారు.