దిశ ఎఫెక్ట్.. మంచం ఎత్తుకెళ్లిన వ్యక్తిపై చర్యలు
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో త్రాగునీటి కుళాయి బిల్లు చెల్లించలేదని ఇంట్లో చొరబడి మంచం ఎత్తుకెళ్లిన గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్‌ని తొలగించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ఇదెక్కడి విడ్డూరం.. నీటి బిల్లు కట్టలేదని ఇలా చేస్తారా…! అంటూ దిశలో ప్రచురితమైన కథనానికి ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, ఎంపీవో గాంధీ స్పందించారు. సోమవారం పెద్ద పోచారం గ్రామ పంచాయతీ పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ, […]
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామంలో త్రాగునీటి కుళాయి బిల్లు చెల్లించలేదని ఇంట్లో చొరబడి మంచం ఎత్తుకెళ్లిన గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్‌ని తొలగించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనపై ఇదెక్కడి విడ్డూరం.. నీటి బిల్లు కట్టలేదని ఇలా చేస్తారా…! అంటూ దిశలో ప్రచురితమైన కథనానికి ఎంపీడీఓ కరుణాకర్ రెడ్డి, ఎంపీవో గాంధీ స్పందించారు. సోమవారం పెద్ద పోచారం గ్రామ పంచాయతీ పాలకవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ, ఎంపీవో గ్రామాన్ని సందర్శించారు. గ్రామ పాలకవర్గం ఆమోదంతో నిర్ణయం తీసుకోవాలని ఎంపీవో సూచించారు. అనంతరంఈ జనరల్ బాడీ సమావేశం, వార్డు సభ్యులు, సర్పంచ్ శశికళ ఆధ్వర్యంలో మల్టీ పర్పస్ వర్కర్ రేపాకుల పుల్లయ్యను తొలగించేందుకు ఏకపక్ష తీర్మానం చేశారు. మహిళపట్ల పంపు ఆపరేటర్ పుల్లయ్య, పంచాయతీకి తెలియకుండా ఇలా చేయడం చాలా విచారకరమన్నారు. వెంటనే అతన్ని విధులనుంచి తొలగిస్తున్నట్లు తీర్మానం చేసి ఆమోదించారు. దీనికి ముందు గ్రామంలో విచారించగా నీటి బిల్లుకు రశీదు పుల్లయ్య ఇవ్వలేదని తేలిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ తెలిపారు. అనంతరం మంచాన్ని పుల్లయ్య బాధిత మహిళ ఇంట్లో అప్పగించడం గమనార్హం.