మరోసారి తెరపైకి దిశ ఎన్కౌంటర్ చిత్రం
దిశ, వెబ్ డెస్క్: దిశ నిందితుల ఎన్కౌంటర్ చిత్రం మరోసారి తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు జ్యూడిషియల్ కమిషన్ను దిశ నిందితుల కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. రాం గోపాల్ వర్మ తీస్తున్న దిశ ఎన్కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సినిమాలో తమ వాళ్లను విలన్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ చిత్రంతో తాము జీవించే స్వేచ్ఛకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కమిషన్కు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని.. విచారణ జరుగుతుంటే సినిమా ఎలా తీస్తారంటూ ఆగ్రహం […]
దిశ, వెబ్ డెస్క్: దిశ నిందితుల ఎన్కౌంటర్ చిత్రం మరోసారి తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు జ్యూడిషియల్ కమిషన్ను దిశ నిందితుల కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. రాం గోపాల్ వర్మ తీస్తున్న దిశ ఎన్కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సినిమాలో తమ వాళ్లను విలన్లుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ చిత్రంతో తాము జీవించే స్వేచ్ఛకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కమిషన్కు విరుద్ధంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారని.. విచారణ జరుగుతుంటే సినిమా ఎలా తీస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే సినిమాను ఆపాలని దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.