ప్రముఖ జర్నలిస్టుపై వర్మ మూవీ

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు వివాదాలతో సావాసం చేయడమంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ప్రతి సినిమా కూడా ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూనే ఉంటుంది.. కాదు, కాదు వివాదాస్పద చిత్రాలనే తీస్తుంటారు. కొవిడ్ కారణంగా థియేటర్లు, మాల్స్, సినీ స్క్రీన్స్ మూతపడటంతో డైరెక్టర్లందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. కానీ, వర్మ మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ‘మర్డర్, థ్రిల్లర్’ చిత్రాలతో బిజీగా ఉన్న ఆర్జీవీ.. త్వరలోనే ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామిపై మూవీ చేయనున్నారు. ఈ […]

Update: 2020-08-03 06:02 GMT

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు వివాదాలతో సావాసం చేయడమంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ప్రతి సినిమా కూడా ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూనే ఉంటుంది.. కాదు, కాదు వివాదాస్పద చిత్రాలనే తీస్తుంటారు. కొవిడ్ కారణంగా థియేటర్లు, మాల్స్, సినీ స్క్రీన్స్ మూతపడటంతో డైరెక్టర్లందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. కానీ, వర్మ మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి ‘మర్డర్, థ్రిల్లర్’ చిత్రాలతో బిజీగా ఉన్న ఆర్జీవీ.. త్వరలోనే ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామిపై మూవీ చేయనున్నారు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ వేదికగా సోమవారం వెల్లడించారు. చిత్రానికి ‘అర్నబ్ -ది న్యూస్ ప్రాస్టిట్యూట్’ అనే టైటిల్ కన్‌ఫర్మ్ చేసినట్లు పేర్కొన్నారు.

అర్నబ్ గోస్వామి ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మీడియాలో పలు డిబేట్స్ నిర్వహించారు. చర్చల సందర్భంగా బాలీవుడ్‌ను ఏకి పారేయడమే కాకుండా, ‘డర్టీ’ అని సంబోధిస్తూ.. బాలీవుడ్‌కు అండర్ వరల్డ్‌తో సంబంధాలున్నాయని ఆరోపించారు. హీరోయిన్ దివ్యభారతి మృతి మొదలుకొని జియాఖాన్, శ్రీదేవి.. ఇప్పుడు సుశాంత్ మరణం వరకు అంతా మిస్టరీగానే ఉందని, దీనికి బాలీవుడ్ సమాధానం చెప్పాల్సిందేనని వ్యాఖ్యానించారు. కాగా, ఈ వ్యాఖ్యలపై డైరెక్టర్ ఆర్జీవీ వరుస ట్వీట్లతో తనదైన శైలిలో బదులిచ్చారు.

బాలీవుడ్ గురించి అర్నబ్ తప్పుగా మాట్లాడటం తనను ఆశ్చరానికి గురి చేసిందన్నారు వర్మ. ‘దివ్య భారతి, జియాఖాన్, శ్రీదేవి, సుశాంత్ మరణాలు ఒకే రకమైనవని అర్నబ్ గుడ్డిగా వాదించడం సరికాదని, ఈ నాలుగు కేసులు పూర్తి విరుద్ధమైనవని, వేర్వేరు సందర్భాల్లో జరిగినవని’ తెలిపారు. ఇందరి మృతికి బాలీవుడ్ ఎలా కారణమని? అదేమన్న శ్మశానంలో నిద్రపోతున్న దయ్యమా? అని ప్రశ్నించారు. అర్నబ్ ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ఆదిత్య చోప్రా, కరణ్ జోహార్, మహేశ్ భట్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఇతర స్టార్లు ఎందుకు స్పందించడం లేదని? వారు బల్లల కింద దాక్కున్నారా? ఇప్పటికైనా స్పందించాలని కోరారు. మౌనంగా ఉంటే కచ్చితంగా తప్పు చేసినట్లే అవుతుందని హెచ్చరించారు.

Tags:    

Similar News