‘పునీత్’ మృతిపై డైరెక్టర్ మెహర్ రమేష్ షాకింగ్ కామెంట్స్.. ఆ కోరిక తీరకుండానే వెళ్లిపోతాడనుకోలేదు!

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై దర్శకుడు మెహర్ రమేష్ స్పందించారు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ఆయనే కారణమని చెప్పారు. పునీత్ హీరోగా నటించిన ‘వీర కన్నడి’గా చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యానని చెప్పుకొచ్చాడు. తనను ఓ కుటుంబసభ్యుడిగా పునీత్ చూసుకున్నారని ఈ సందర్భంగా మెహర్ రమేష్ గుర్తు చేసుకున్నారు. అయితే, పునీత్‌కు మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక ఉండేదని, తనను ఒక […]

Update: 2021-10-30 08:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంపై దర్శకుడు మెహర్ రమేష్ స్పందించారు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు ఆయనే కారణమని చెప్పారు. పునీత్ హీరోగా నటించిన ‘వీర కన్నడి’గా చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యానని చెప్పుకొచ్చాడు. తనను ఓ కుటుంబసభ్యుడిగా పునీత్ చూసుకున్నారని ఈ సందర్భంగా మెహర్ రమేష్ గుర్తు చేసుకున్నారు.

అయితే, పునీత్‌కు మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరిక ఉండేదని, తనను ఒక ఛాన్స్ అడిగారని.. ఈ విషయాన్ని తాను చిరుకు కూడా వివరించానని, ఆయన కోసం ఓ ప్రత్యేక సీన్ రాయాలని అనకున్నట్టు తెలిపారు. కానీ, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని.. తన కోరిక నేరవేరకుండానే పునీత్ ఈ లోకాన్ని వదిలివెళ్లడం తనను ఎంతగానో బాధించిందని మెహర్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News