వాళ్ల లవ్ ఇన్నింగ్స్.. అలా మొదలైంది!
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమలో పడటం కన్నా, ప్రేమను వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అయితే ఆ ప్రేమను తమలోనే దాచుకుని ఎదుటివారికి చెప్పలేక ముగిసిపోయిన ప్రేమకథలకు కొదువేం లేదు. అలా కాకుండా ధైర్యంగా ‘ఐ లవ్ యూ’ చెప్పి, పెళ్లి పీటలెక్కిన ప్రేమ జంటలు మాత్రం ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. ఇటీవల సిడ్నీ వేదికగా ఇండియా- ఆసీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో.. ఓ ఇండియన్ తన ఆస్ట్రేలియన్ గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమలో పడటం కన్నా, ప్రేమను వ్యక్తపరచడం చాలా ముఖ్యం. అయితే ఆ ప్రేమను తమలోనే దాచుకుని ఎదుటివారికి చెప్పలేక ముగిసిపోయిన ప్రేమకథలకు కొదువేం లేదు. అలా కాకుండా ధైర్యంగా ‘ఐ లవ్ యూ’ చెప్పి, పెళ్లి పీటలెక్కిన ప్రేమ జంటలు మాత్రం ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తుంటాయి. ఇటీవల సిడ్నీ వేదికగా ఇండియా- ఆసీస్ మధ్య జరిగిన రెండో వన్డేలో.. ఓ ఇండియన్ తన ఆస్ట్రేలియన్ గర్ల్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా ఓకే చెప్పడంతో స్టేడియంలో చప్పట్ల మోత మోగింది. ఆ వీడియోను సిడ్నీ క్రికెట్ స్టేడియం ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ జంట లవ్ ఇన్నింగ్ ఎలా మొదలైందన్న విషయాన్ని ఆ ఇండియన్ తన ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు.
మెల్‌బోర్న్‌లో ఉండే ఇండియాకు చెందిన దీపెన్ మండాలియా.. 2018 అక్టోబర్‌లో సిడ్నీకి షిఫ్ట్ అయ్యాడు. అక్కడే ఓ చిన్న అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. సినిమాల్లో చూపించిన విధంగా, అప్పటివరకు ఆ ఫ్లాట్‌లో ఉన్న వారి మీద కొన్ని పోస్ట్‌లు వచ్చాయి. దీపెన్ స్వయంగా వెళ్లి ఆ పోస్ట్‌లను వారికి అందించాలనుకున్నాడు. ఆ పోస్ట్ ‘రోసిలై వింబుష్’ పేరు మీద రావడంతో, అపార్ట్‌మెంట్‌లో ఎంక్వైరీ చేసి తన అడ్రస్ తెలుసుకున్నాడు. అలా తొలిసారి ఆమెను కలవడానికి వెళ్లాడు. అక్కడ మొదలైంది వాళ్ల లవ్ స్టోరీ.
‘నేను ఆమెను చూడగానే చాలా నెర్వస్‌గా ఫీల్ అయ్యాను. అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మాత్రం కాదు. ఆ మీటింగ్ జస్ట్ పది, ఇరవై సెకన్లలో అయిపోయింది. ఆ లెటర్ ఆమెకు ఇచ్చి మెల్లగా ‘బై’ అని చెప్పాను. అయితే అలా మొదలైన పరిచయం తర్వాత కాఫీ తాగేవరకు వచ్చింది. అది కాస్త డ్రింక్స్, ఆ తర్వాత డిన్నర్స్ వరకు వెళ్లింది. మా ఇద్దరి మధ్య కనెక్షన్ పెంచింది మాత్రం క్రికెట్. మేమిద్దరం కూడా ఆపోజిట్ టీమ్స్. అదే మా ఇద్దరి బంధాన్ని మరింత దగ్గర చేసింది. దాంతో క్రికెట్ స్టేడియం, అందులో ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచ్, ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏముంటుంది. అలా ఆమెకు ప్రపోజ్ చేశాను. ఆమె ఒప్పుకోవడంతో ఆ రోజు ప్రపంచంలో నేనే లక్కీయెస్ట్ పర్సన్ అనిపించింది. ఇక ఇప్పుడు, ఎప్పుడూ మాదొక ‘లాంగ్ ఇన్నింగ్స్’ కొనసాగుతోంది. మా ఇద్దరి ప్రేమకు ప్రేక్షకులంతా మద్దతు తెలిపినందుకు సంతోషం. వారికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా ప్రపోజ్ యాక్సెప్ట్ చేసిన రోస్‌కు చాలా చాలా థాంక్యూ’ అని దీపన్ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చాడు.