సుశాంత్ ‘దిల్ బెచారా’ న్యూ రికార్డ్

సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో హాలీవుడ్ సినిమాలను వెనక్కినెట్టి మరీ మోస్ట్ లైక్డ్ ట్రైలర్‌గా రికార్డు సాధించగా.. ప్రస్తుతం మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. సుశాంత్ చివరి చిత్రం కావడంతో ‘దిల్ బెచారా’ సినిమాను అభిమానులందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్. సబ్‌స్క్రైబర్స్, నాన్ సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా ఫ్రీగా సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది. జులై […]

Update: 2020-07-25 02:45 GMT
సుశాంత్ ‘దిల్ బెచారా’ న్యూ రికార్డ్
  • whatsapp icon

సుశాంత్ సింగ్ రాజ్‌‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బెచారా’ రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్‌లో హాలీవుడ్ సినిమాలను వెనక్కినెట్టి మరీ మోస్ట్ లైక్డ్ ట్రైలర్‌గా రికార్డు సాధించగా.. ప్రస్తుతం మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

సుశాంత్ చివరి చిత్రం కావడంతో ‘దిల్ బెచారా’ సినిమాను అభిమానులందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్. సబ్‌స్క్రైబర్స్, నాన్ సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా ఫ్రీగా సినిమా చూసే అవకాశాన్ని కల్పించింది. జులై 24 న రా: 7:30 గంటలకు ప్రసారమైన ఈ సినిమా.. అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. నా అంత్యక్రియలకు నేను హాజరుకావాలని ఉందన్న సుశాంత్ డైలాగ్, నటన కన్నీరు పెట్టించింది. సినిమా చూస్తున్నంత సేపు అభిమానుల గుండెలను పిండేస్తూ.. ఎమోషనల్‌గా కనెక్ట్ చేసింది.

కాగా, సుశాంత్‌పై ఉన్న అభిమానం.. ఈ చిత్రానికి మరో రికార్డును ఇచ్చేసింది. ఐఎంబీడీలో 9.8 రేటింగ్ సాధించి.. ఇండియన్ సినీ హిస్టరీలో అత్యధిక ఐఎంబీడీ రేటింగ్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

Tags:    

Similar News