లక్ష్యం నెరవేరింది కానీ, సుశాంత్ లేడు
దిశ, స్పోర్ట్స్: ‘నేను క్రికెటర్‌గా ఒక స్థాయికి చేరుకున్నాక తప్పకుండా నిన్ను కలుస్తా’ అని ఒక యువ క్రికెటర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌కు మాటిచ్చాడు. అనుకున్నట్లే ఆ క్రికెటర్ లక్ష్యాన్ని చేరుకున్నాడు. కానీ, కలవడానికి ఇప్పుడు సుశాంత్ లేడు. మనసును కలచివేసే ఈ మాటలను ఆ యువ క్రికెటర్ మీడియాతో పంచుకున్నాడు. సుశాంత్ ‘కై పో చె’ అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాలో ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ […]
దిశ, స్పోర్ట్స్: ‘నేను క్రికెటర్‌గా ఒక స్థాయికి చేరుకున్నాక తప్పకుండా నిన్ను కలుస్తా’ అని ఒక యువ క్రికెటర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌కు మాటిచ్చాడు. అనుకున్నట్లే ఆ క్రికెటర్ లక్ష్యాన్ని చేరుకున్నాడు. కానీ, కలవడానికి ఇప్పుడు సుశాంత్ లేడు. మనసును కలచివేసే ఈ మాటలను ఆ యువ క్రికెటర్ మీడియాతో పంచుకున్నాడు. సుశాంత్ ‘కై పో చె’ అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఆ సినిమాలో ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా నటించాడు. అతనే దిగ్విజయ్ దేశ్‌ముఖ్. అప్పుడు దిగ్విజయ్ వయసు 15ఏండ్లు. షూటింగ్ సమయంలో ఆరు నెలలపాటు సుశాంత్, దిగ్విజయ్ ఎంతో అన్యోన్యంగా మెలిగేవారు. సుశాంత్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. షూటింగ్ చివరిరోజు దిగ్విజయ్ ఒక మాటిచ్చాడట. నేను ఒక మంచి క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాక నిన్ను తప్పక కలుస్తాను అన్నాడు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ వేలం సందర్భంగా దిగ్విజయ్‌ను ముంబయి ఇండియన్స్ వేలంలో కొనుక్కుంది. దీంతో అప్పుడే సుశాంత్‌ను కలవాలని అనుకున్నా కుదరలేదు. ఆతర్వాత లాక్‌డౌన్ రావడంతో వీలు పడలేదు. ఇక ఇప్పుడు కలుద్దామన్నా సుశాంత్ లేడు అంటూ బాధ పడ్డాడు.