స్టూడెంట్స్‌కు ‘లాంగ్వేజ్’ ప్రాబ్లమ్..!

ఎట్టకేలకు పిల్లలు పాఠాలు వినడం మొదలు పెట్టారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆన్‌లైన్ పాఠాలు స్టాట్ అయ్యాయి. పాఠాలు తెలుగులో చెప్పడంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి కొంత మంది విద్యార్థులు సిలబస్ తగ్గించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరోనా వైరస్ సృష్టించిన గందరగోళం వల్ల గత నాలుగు నెలలకు చదువుకు దూరమైన విద్యార్థులు పాఠాలు వినడం ఆరంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా విద్యా బోధనకు శ్రీకారం […]

Update: 2020-09-02 04:32 GMT

ఎట్టకేలకు పిల్లలు పాఠాలు వినడం మొదలు పెట్టారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆన్‌లైన్ పాఠాలు స్టాట్ అయ్యాయి. పాఠాలు తెలుగులో చెప్పడంతో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి కొంత మంది విద్యార్థులు సిలబస్ తగ్గించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరోనా వైరస్ సృష్టించిన గందరగోళం వల్ల గత నాలుగు నెలలకు చదువుకు దూరమైన విద్యార్థులు పాఠాలు వినడం ఆరంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా విద్యా బోధనకు శ్రీకారం చుట్టడంతో బడిబాట పట్టాల్సిన విద్యార్థులు ఇంటివద్దే ఉండి చదుకోవడం ప్రారంభించారు. ప్రైమరీ విద్యార్థులకు క్లాసులు చెప్పడంలో ఆలస్యం అయినా హైస్కూల్ విద్యార్థులకు మాత్రం సకాలంలోనే ఆన్‌లైన్‌లో పాఠాలు ప్రసారం అయ్యాయి.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ అధ్యాపక బృందం ప్రభుత్వం ఇచ్చిన సూచనలకు తోడు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆన్‌లైన్ విద్యా బోధనకు సన్నాహాలు చేశారు. ఇంటివద్ద టీవీలు, స్మార్ట్ ఫోన్ల ద్వారా పాఠాలు వినే అవకాశం ఉన్న వారికి సలహాలు ముందుగానే అందించారు. ఈ సౌకర్యం లేని పిల్లలను గుర్తించిన టీచర్లు హైస్కూల్‌లో డిజిటల్ రూంలో పాఠాలు వినేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వీరికి సోషల్ డిస్టెన్స్‌లో ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేసిన టీచర్లు ప్రత్యేకంగా సంబంధిత పాఠ్యాంశానికి సంబంధించి టీచర్ పర్యవేక్షణగా ఉన్నారు.ఆన్‌లైన్‌లో తెలుగులో పాఠాలు చెప్పడం వల్ల విద్యార్థులు కొంత ఇబ్బంది పడ్డారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ బోధనకు అలవాటు పడ్డ స్టూడెంట్స్ తెలుగు బోధన వల్ల కొన్ని పదాలను అర్థం చేసుకోలేకపోయారు. ఈ విషయాన్ని గమనించిన టీచర్లు ఆన్‌లైన్ క్లాసులు ముగిసిన తరువాత స్టూడెంట్స్ ఇంటికి వెళ్లి వారి డౌట్లను తీర్చారు.

ఇంగ్లీష్ బోధించాలి..

ఆన్‌లైన్ లో పాఠాల వల్ల చదువులో పురోగతి సాధిస్తామన్న నమ్మకం ఏర్పడింది. ఆన్ లైన్ విద్యా విధానం చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుంది. అయితే సబ్జెక్టులు ఇంగ్లీష్ లో కూడా బోధిస్తే బాగుటుంది. తెలుగు బాషతో కొంత అసౌకర్యంగా అనిపించింది. మా స్కూల్ టీచర్లు తెలుగులో చెప్పిన పాఠాల్లో వచ్చిన అనుమానాలను నివృత్తి చేసేందుకు వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. మా డౌట్‌ను అందులో పోస్ట్ చేయగానే సార్లు వెంటనే తీరుస్తున్నారు. స్కూలుకు వెళ్లి ప్రాక్టికల్‌గా చదువుకున్నంత సులువు కాకపోయినప్పటికీ తప్పని సరి పరిస్థితుల్లో ఆన్‌లైన్ విద్యా విధానం అమలు చేయడం మాకు లాభమే. – శ్రీలేఖ, పదో తరగతి, పత్తిపాక

సిలబస్ తగ్గించాలి..

తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో పాఠాలు చెప్పే విధానాన్ని కూడా ప్రారంభించాలి. దీని వల్ల మాకు పూర్తిగా అర్థం అవుతుంది. ఈ ఏడాది ఆలస్యంగా చదువులు స్టార్ట్ అయినందున ప్రభుత్వం సిలబస్ తగ్గిస్తే బావుంటుంది. తక్కువ సమయంలో ఎక్కువగా చదవడంతో ఇబ్బంది అవుతుంది. మాపై బారం కూడా ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నందున సిలబస్ తగ్గించే విషయంపై ప్రభుత్వం ఆలోచించాలి. – అక్షిత, 10వ తరగతి, పత్తిపాక హైస్కూల్

వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేశాం ..

స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా రెండు వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేశాం. బాయ్స్‌కు, గర్ల్స్ వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఈ గ్రూపుల ద్వారా వారితో టచ్‌లో ఉంటున్నాం. ఆన్‌లైన్ బోధనకు శ్రీకారం చుట్టడంతో తాము ముందుగానే వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేయడం లాభించింది. అయితే మా విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆన్ లైన్ తరగతులు ముగిసిన తరువాత వారి ఇళ్ల వద్దకే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఈ పద్దతి వల్ల విద్యార్థుల్లో పాఠాలపై అవగాహన పెరగడమే టీచర్లే స్వయంగా వస్తున్నారన్న భావనతో ప్రతి విద్యార్థి కూడా ఆన్‌లైన్ పాఠాలు వినే అవకాశం ఉంటుంది. – పీర్ షేక్ హెచ్‌ఎం

Tags:    

Similar News