క్వారంటైన్.. ఐసోలేషన్.. తేడా ఏంటి?

దిశ వెబ్ డెస్క్: కరోనా విజృంభించినప్పటి నుంచీ ప్రపంచవ్యాప్తంగా క్వారంటైన్‌, ఐసొలేషన్‌ వంటి పదాలు తరచూ వినిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే వీటిని పాటించాల్సిందేనని డాక్టర్లు పదే పడే చెబుతున్నారు. ఇంతకీ క్వారంటైన్‌, ఐసొలేషన్‌ అంటే ఏమిటి? ఈ రెండూ ఒకటేనా? వేర్వారా? తెలుసుకుందాం.. క్వారంటైన్‌ అంటే.. నిర్బంధంగా దూరం పాటించడం.. ఐసొలేషన్‌ అంటే ఒంటరిగా ఉంచడం. క్వారంటైన్: వైరస్‌ విస్తృతంగా వ్యాపించిన దేశాన్ని, ప్రదేశాన్ని సందర్శించిన లేదా, వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసలుకున్న వ్యక్తులు ఆ వైరస్‌కు […]

Update: 2020-03-28 08:26 GMT

దిశ వెబ్ డెస్క్: కరోనా విజృంభించినప్పటి నుంచీ ప్రపంచవ్యాప్తంగా క్వారంటైన్‌, ఐసొలేషన్‌ వంటి పదాలు తరచూ వినిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే వీటిని పాటించాల్సిందేనని డాక్టర్లు పదే పడే చెబుతున్నారు. ఇంతకీ క్వారంటైన్‌, ఐసొలేషన్‌ అంటే ఏమిటి? ఈ రెండూ ఒకటేనా? వేర్వారా? తెలుసుకుందాం..

క్వారంటైన్‌ అంటే.. నిర్బంధంగా దూరం పాటించడం.. ఐసొలేషన్‌ అంటే ఒంటరిగా ఉంచడం.

క్వారంటైన్:
వైరస్‌ విస్తృతంగా వ్యాపించిన దేశాన్ని, ప్రదేశాన్ని సందర్శించిన లేదా, వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసలుకున్న వ్యక్తులు ఆ వైరస్‌కు ప్రభావితమై ఉంటారనే కారణంతో బలవంతంగా నిర్బంధoలో ఉంచడం లేదా స్వీయ నిర్బంధo విధించుకోవడం క్వారంటైన్‌. కదలికల్ని నియంత్రించడం దీని ముఖ్య ఉద్దేశం. ఫ్లూ లక్షణాలు కనిపించినపుడు కనీసం 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తారు.

ఐసోలేషన్:
వైరస్‌ నిర్ధారణ అయిన లేదా వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న వ్యక్తుల్ని ఒక గదిలో వేరుగా ఉంచడం ఐసొలేషన్‌. వైరస్‌ సోకిన వ్యక్తి దాన్నుంచి కోలుకునేదాకా ఇతరులకు వ్యాపింపజేయకుండా నివారించడం ఐసొలేషన్‌ ముఖ్యోద్దేశం.

Tags:    

Similar News