న్యూయార్క్‌లో ప్రిన్స్ 'అలా' ఎంజాయ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర హీరోల సినిమాలను సపోర్ట్ చేసేందుకు ముందుంటాడు. స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్, చిన్న హీరోల సినిమాల టీజర్, ట్రైలర్, సాంగ్ రిలీజ్ చేయడం ద్వారా తన వంతు మద్ధతు ఇస్తాడు. మొత్తానికి టాలీవుడ్ హీరోలతో ఫ్రెండ్లీగానే ఉంటాడు ప్రిన్స్. అయితే ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు వచ్చేసరికి మాత్రం… ‘సరిలేరు నీకెవ్వరు’కు కాంపిటీషన్‌గా తీసుకున్నాడు. ఇతర సినిమాల్లో తనకు నచ్చిన అంశాలను ప్రస్తావించి ప్రశంసించే […]
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర హీరోల సినిమాలను సపోర్ట్ చేసేందుకు ముందుంటాడు. స్టార్ హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్, చిన్న హీరోల సినిమాల టీజర్, ట్రైలర్, సాంగ్ రిలీజ్ చేయడం ద్వారా తన వంతు మద్ధతు ఇస్తాడు. మొత్తానికి టాలీవుడ్ హీరోలతో ఫ్రెండ్లీగానే ఉంటాడు ప్రిన్స్. అయితే ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు వచ్చేసరికి మాత్రం… ‘సరిలేరు నీకెవ్వరు’కు కాంపిటీషన్‌గా తీసుకున్నాడు. ఇతర సినిమాల్లో తనకు నచ్చిన అంశాలను ప్రస్తావించి ప్రశంసించే మహేష్ అల్లు అర్జున్ విషయంలో మాత్రం అలా చేయలేదు.
అన్ని సినిమాల మాదిరిగానే హైదరాబాద్‌లో అల వైకుంఠపురంలో సినిమా చూద్దామని అనుకున్నా మళ్లీ మీడియా ఎలా తీసుకుంటుందోననే భయంతో చూడలేకపోయాడు. ప్రస్తుతం విదేశాల్లో ఫ్యామిలీతో కలిసి ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న మహేష్ పనిలోపనిగా న్యూయార్క్‌లో అల వైకుంఠపురంలో సినిమా చూశాడట. భార్య నమ్రతా, పిల్లలు సితార, గౌతమ్‌లతో కలిసి మూవీ చూసిన మహేష్ చాలా ఎంజాయ్ చేశాడట. అయితే అల్లు అర్జున్ కూడా మహేష్‌బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాను చూసే ఉంటారు అంటున్నారు నెటిజన్లు. అంతకు ముందు బన్నీ తండ్రి అల్లు అరవింద్ చెప్పినట్లుగా మాస్క్ ధరించి థియేటర్‌కు వెళ్లి సినిమా చూసే ఉంటారని అభిప్రాయపడుతున్నారు.