డైమండ్ పరిశ్రమ ఆదాయంలో 20 శాతం క్షీణత!

దిశ, వెబ్‌డెస్క్: కీలకమైన ఎగుమతి మార్కెట్లలో రికవరీ, డిమాండ్ నేపథ్యంలో దేశీయ డైమండ్ పరిశ్రమ ఆదాయం 20 శాతం క్షీణించే అవకాశాలున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా పరిశ్రమ ఆదాయంలో మూడో వంతు తగ్గిపోనుందని, దీనివల్ల పరిశ్రమ ఆదాయం సుమారు రూ. 1.11 లక్షల కోట్లకు పరిమితమవుతుందని క్రిసిల్ నివేదిక అభిప్రాయపడింది. ‘అమెరికా, చైనా వంటి కీలక మార్కెట్లలో డిమాండ్, రిటైల్ మార్కెట్ల రికవరీ నేపథ్యంలో పరిశ్రమ మెరుగ్గా ఉందని, దీనివల్ల […]

Update: 2021-01-24 07:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: కీలకమైన ఎగుమతి మార్కెట్లలో రికవరీ, డిమాండ్ నేపథ్యంలో దేశీయ డైమండ్ పరిశ్రమ ఆదాయం 20 శాతం క్షీణించే అవకాశాలున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. కొవిడ్-19 మహమ్మారి కారణంగా పరిశ్రమ ఆదాయంలో మూడో వంతు తగ్గిపోనుందని, దీనివల్ల పరిశ్రమ ఆదాయం సుమారు రూ. 1.11 లక్షల కోట్లకు పరిమితమవుతుందని క్రిసిల్ నివేదిక అభిప్రాయపడింది. ‘అమెరికా, చైనా వంటి కీలక మార్కెట్లలో డిమాండ్, రిటైల్ మార్కెట్ల రికవరీ నేపథ్యంలో పరిశ్రమ మెరుగ్గా ఉందని, దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆదాయం రూ. 1.11 లక్షల కోట్లుగా ఉండొచ్చని వివరించింది.

డిమాండ్ మందగమనం, లాక్‌డౌన్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి సగంలో ఎగుమతులు సుమారు రూ. 40 వేల కోట్లకు పడిపోయింది. నెలవారీగా డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఎగుమతులు రూ. 11 వేల కోట్లకు పెరిగాయి. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరానికి మెరుగైన స్థితిలో పరిశ్రమ ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్ సుబోధ్ రాయ్ వెల్లడించారు.

Tags:    

Similar News