జట్టులోకి శిఖర్, పాండ్యా..

మార్చి 12 నుంచి 18 వరకు దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఈ వన్డే సిరీస్‌కి కోహ్లీ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. సునీల్ జోషి సారథ్యంలోని కొత్త సెలెక్షన్ కమిటీకి ఇదే తొలి సెలెక్షన్ కావడం గమనార్హం. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్‌లతో పాటు ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాకు ఈ సిరీస్‌ కోసం జట్టులో […]

Update: 2020-03-08 07:31 GMT

మార్చి 12 నుంచి 18 వరకు దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ఈ వన్డే సిరీస్‌కి కోహ్లీ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించింది. సునీల్ జోషి సారథ్యంలోని కొత్త సెలెక్షన్ కమిటీకి ఇదే తొలి సెలెక్షన్ కావడం గమనార్హం.

గాయం కారణంగా జట్టుకు దూరమైన ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్‌లతో పాటు ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యాకు ఈ సిరీస్‌ కోసం జట్టులో చోటు కల్పించారు. అయితే రోహిత్ శర్మ ఇంకా గాయం నుంచి కోలుకోకపోవడంతో అతడిని ఎంపిక చేయలేదు. భుననేశ్వర్ జట్టులో చేరడంతో పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చారు.

ఇండియా జట్టు : శిఖర్ ధావన్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహల్, బూమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభమన్ గిల్.

tags: team selection, southafrica series, India, Shikhar Dhawan, Pandya

Tags:    

Similar News