నేను చెప్పేదంతా నిజమే.. టెర్రర్ అటాక్‌పై బాలీవుడ్ హీరో
దిశ, సినిమా : యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. రామ్ మాధ్వానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుండగా.. లేటెస్ట్‌గా విడుదలైన టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘భరోసా 24/7’ న్యూస్ చానెల్‌లో పని చేస్తున్న అర్జున్ పఠాక్(కార్తీక్ ఆర్యన్) మిస్టీరియస్ బాంబ్ బ్లాస్ట్ గురించి ప్రైమ్ టైమ్ న్యూస్‌లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ మానవత్వమున్న వ్యక్తిగా మిగిలిపోవాలా లేక భవిష్యత్తు బాగుండాలనే స్వార్థంతో ముందుకు సాగాలా? అనే ఓ […]
దిశ, సినిమా : యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. రామ్ మాధ్వానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుండగా.. లేటెస్ట్‌గా విడుదలైన టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ‘భరోసా 24/7’ న్యూస్ చానెల్‌లో పని చేస్తున్న అర్జున్ పఠాక్(కార్తీక్ ఆర్యన్) మిస్టీరియస్ బాంబ్ బ్లాస్ట్ గురించి ప్రైమ్ టైమ్ న్యూస్‌లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ మానవత్వమున్న వ్యక్తిగా మిగిలిపోవాలా లేక భవిష్యత్తు బాగుండాలనే స్వార్థంతో ముందుకు సాగాలా? అనే ఓ సిచ్యుయేషన్‌లో పడిపోయిన అర్జున్.. నెర్వస్, ప్రెజర్ ఫీల్ అయి లైవ్‌లోనే బ్లడ్ వామిట్స్ చేసుకుంటాడు. కెమెరాలు ఆఫ్ చేయాలని చానల్‌కు సూచించినా, తన పని తాను కంటిన్యూ చేయాలని మోటివేట్ చేస్తుంటుంది హై అథారిటీ. ఎలాగోలా తేరుకున్న అర్జున్.. న్యూస్ ప్రజెంట్ చేసి, చానల్ యాజమాన్యాన్ని తిట్టేస్తాడు. ఇంట్రెస్టింగ్‌గా సాగిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. ‘నేను ఏది చెప్పినా.. నిజమే చెప్తాను’ అన్న భరోసా 24/7 చానల్ న్యూస్ ప్రజెంటర్‌గా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు కార్తీక్ ఆర్యన్.
https://twitter.com/TheAaryanKartik/status/1366610507872890883?s=20
కాగా ‘ధమాకా’ సినిమాను ఉత్తేజకరమైన, సుసంపన్నమైన అనుభవంగా వర్ణించాడు కార్తీక్ ఆర్యన్. రామ్ మాధ్వానీ లాంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని.. తనను కొత్తగా అన్వేషించేందుకు, ప్రదర్శించేందుకు ఇది అనుమతించిందన్నారు. ‘ధమాకా’ సినిమా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను చేరుతుండటం థ్రిల్లింగ్ ఇస్తుందన్నారు.