ఎస్పీలకు ఆదేశాలిచ్చాం : డీజీపీ

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్ధంలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఆదివారం పలు సంఘాలు చలో రామతీర్థంకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ.. ఆలయాలపై వరుస ఘటనలతో పోలీస్‌శాఖ సహా అన్ని శాఖలను అప్రమత్తం చేశామని తెలిపారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. అంతేగాకుండా ఆలయాల పవిత్ర కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. అనుమానస్పద వ్యక్తుల కదలికల సమాచారాన్ని వెంటనే […]

Update: 2021-01-02 23:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్ధంలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఆదివారం పలు సంఘాలు చలో రామతీర్థంకు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందిస్తూ.. ఆలయాలపై వరుస ఘటనలతో పోలీస్‌శాఖ సహా అన్ని శాఖలను అప్రమత్తం చేశామని తెలిపారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. అంతేగాకుండా ఆలయాల పవిత్ర కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు. అనుమానస్పద వ్యక్తుల కదలికల సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలుపాలని సూచించారు. ఇప్పటికే దేవాలాయాల భద్రత చర్యలను పర్యవేక్షించాలని ఎస్పీలకు ఆదేశాలిచ్చామని స్పష్టం చేశారు. ప్రతి ఆలయంలో సీసీ కెమెరాల ఏర్పాటు, జియో ట్యాగింగ్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని కొంతమంది కావాలనే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News