Yadagirigutta News : వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమైన యాదగిరిగుట్ట

తెలంగాణ వాసుల శ్రీవారి దేవస్థానం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి(Yadagirigutta LakshmiNarasimhaSwamy) భక్తులకు గుడ్ న్యూస్.

Update: 2025-02-27 15:11 GMT
Yadagirigutta News : వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్దమైన యాదగిరిగుట్ట
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ వాసుల శ్రీవారి దేవస్థానం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి(Yadagirigutta LakshmiNarasimhaSwamy) భక్తులకు గుడ్ న్యూస్. రానున్న వార్షిక బ్రహ్మోత్సవాల(Brahmotsavas)కు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం సర్వం సిద్ధం అవుతోంది. మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో భాస్కరరావు పేర్కొన్నారు. మార్చి 1న విష్వక్సేన ఆరాధనతో మొదలవనున్న బ్రహ్మోత్సవాలు.. 2న ధ్వజారోహణ, అగ్నిప్రతిష్టాపన జరగనున్నాయి. 3 నుంచి అలంకరణ సేవలు, 4న వటపత్రశాయి సేవ, 5న కృష్ణాలంకరణ సేవ, 6న గోవర్ధనగిరి సేవ, 7న స్వామివారి ఎదుర్కోళ్ళ మహోత్సవం, 8న తిరుకళ్యాణ మహోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న చక్రతీర్థ మహోత్సవాలు జరగనున్నాయి. 11న జరిగే శతఘటాభిషేకంతో లక్ష్మినరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. కావున భక్తులు విశేషంగా పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ఈవో కోరారు.

Tags:    

Similar News